AUS vs IND : తొలి టెస్టు పిచ్‌ను చూశారా? బ్యాటర్ల వెన్నులో వణుకే.. టీమ్ఇండియాకు కష్టకాలమే?
ఆసీస్ గడ్డపై వరుసగా రెండు సార్లు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని గెలిచింది భారత్.

Perth Stadium Pitch For India vs Australia 1st Test Revealed
AUS vs IND : ఆసీస్ గడ్డపై వరుసగా రెండు సార్లు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని గెలిచింది భారత్. అదే ఉత్సాహంతో మూడోసారి విజేతగా నిలవాలని భావిస్తోంది. అయితే.. ఈ సారి ఆ ఛాన్స్ ఇవ్వకూడదని ఆస్ట్రేలియా గట్టి పట్టుదలగా ఉంది. ఈ క్రమంలో నవంబర్ 22 నుంచి ప్రారంభం కానున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ హోరాహోరీగా జరిగే సూచనలు ఉన్నాయి. పెర్త్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్లు తొలి టెస్టు మ్యాచ్‌లో తలపడనున్నాయి.
నవంబర్ 22 నుంచి 26 వరకు ఈ మ్యాచ్ జరగనుంది. కాగా.. పెర్త్ పిచ్‌కు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక మ్యాచ్ జరిగే సమయంలో వరుణుడు ఆటకం కలిగించే అవకాశాలు ఉన్నాయా? పెర్త్‌లో అత్యధిక స్కోరు ఎంత? అత్యల్ప స్కోరు ఎంత ? అన్నది చూద్దాం.
సాధారణంగా పెర్త్ పిచ్ బౌలర్లకు స్వర్గధామం. తొలి టెస్టుకు కూడా పేస్, బౌన్సీ పిచ్ ను సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. పిచ్‌పై ఎక్కువగా గడ్డి ఉంది. దీంతో బంతి బౌన్స్‌తో పాటు స్వింగ్ అవుతూ ఉంటుంది. ఇలాంటి పిచ్ పై పరుగులు చేయడం బ్యాటర్లకు అంత సులువు కాదు. అయితే.. ఒక్కసారి కుదురుకుంటే పరుగులు చేయడం పెద్ద కష్టం కాదు. వెస్ట్రన్ ఆస్ట్రేలియా క్రికెట్ హెడ్ క్యూరేటర్ ఐజాక్ మెక్‌డొనాల్డ్ మాట్లాడుతూ ఇలా అన్నాడు. ‘ఇది ఆస్ట్రేలియా.. ఇది పెర్త్.. మంచి పేస్, బౌన్స్, స్వింగ్ ఉంటుందని.’ చెప్పాడు.
ఈ మ్యాచ్‌కు ఎలాంటి వర్షం ముప్పు లేదు. అయితే.. ఆకాశం మేఘావృతమై ఉండొచ్చు.
పెర్త్ స్టేడియం టెస్ట్ గణాంకాలు..
తొలి ఇన్నింగ్స్ సగటు స్కోరు 456 పరుగులు కాగా.. రెండో ఇన్నింగ్స్‌లో సగటు స్కోరు 250 పరుగులు. మూడో ఇన్నింగ్స్ సగటు స్కోరు 218 పరుగులు కాగా నాల్గో ఇన్నింగ్స్‌లో సగటు స్కోరు 183 పరుగులు గా ఉంది.
ఆస్ట్రేలియాతో సిరీస్ కోసం భారత జట్టు ఇదే :
రోహిత్ శర్మ (కెప్టెన్), బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రాహుల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, రవీంద్ర జడేజా , ఆకాష్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్.
PITCH FOR THE FIRST TEST IN BGT…!!!! [RevSportz] pic.twitter.com/oo697X5cXu
— Johns. (@CricCrazyJohns) November 19, 2024