Blind T20 World Cup : పాక్‌కు షాక్.. అంధుల టీ20 ప్రపంచకప్ నుంచి వైదొలిగిన భారత్..!
పాకిస్థాన్ వేదికగా నవంబర్ 23 నుంచి డిసెంబర్ 3 వరకు అంధుల టీ20 ప్రపంచకప్ జరగనుంది.

India pull out of Blind T20 World Cup in Pakistan after no government clearance
Blind T20 World Cup : పాకిస్థాన్ వేదికగా నవంబర్ 23 నుంచి డిసెంబర్ 3 వరకు అంధుల టీ20 ప్రపంచకప్ జరగనుంది. అయితే.. ఈ టోర్నీ నుంచి భారత జట్టు తప్పుకుంది. పాక్ వెళ్లేందుకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అనుమతి నిరాకరించడమే అందుకు కారణం. పాక్ వెళ్లేందుకు అందుల క్రికెట్ జట్టుకు క్రీడా మంత్రిత్వ శాఖ నుంచి నో-అబ్జెక్షన్ సర్టిఫికేట్ (నిరభ్యంతర) లభించింది. అయితే.. పాక్ కు టీమ్ఇండియాను పంపేందుకు విదేశాంగ శాఖ ఆమోదం లభించలేదని భారత అందుల క్రికెట్ సంఘం ప్రధాన కార్యదర్శి శైలేంద్ర యాదవ్ తెలిపారు.
‘పాకిస్తాన్ వెళ్లేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి కోసం గత 25 రోజులుగా ఎదురుచూస్తున్నాం. టోర్నమెంట్‌కు సమయం దగ్గర పడింది. దీంతో నేను విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA)తో ఫోన్‌లో మాట్లాడాను. పాకిస్థాన్‌కు వెళ్లేందుకు మాకు ఎలాంటి అనుమతి లభించదని, మీ టోర్నమెంట్‌ను రద్దు చేసుకోవచ్చని చెప్పారు. మాకు అధికారిక తిరస్కరణ లేఖ కూడా వస్తుందని చెప్పారు. అయితే.. లేఖ ఇంకా అందలేదు. కానీ MEAతో మా సంభాషణ ఆధారంగా మేము పాకిస్తాన్‌కు వెళ్లకూడదని నిర్ణయించుకున్నాము. మేము అంధుల T20 ప్రపంచ కప్‌లో పాల్గొనము.’ అని యాదవ్ ఇండియా టుడేతో మాట్లాడుతూ చెప్పారు.
SA vs SL : ఫ్యాన్స్‌కు శుభవార్త.. కెప్టెన్ వచ్చేస్తున్నాడు..
భారత్‌తో పాటు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లు కూడా ఈ టోర్నీలో పాల్గొనడం లేదని ఆటగాళ్ల కష్టమంతా వృథా అవుతుందని ఆవేదన వ్యక్తం చేశాడు యాదవ్. భారత్, పాకిస్థాన్‌ల మధ్య మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఇప్పుడు మేము టోర్నీలో పాల్గొనకపోవడంతో పాకిస్తాన్‌కు ఉచిత వాక్ ఓవర్ లభిస్తుంది. ఇన్నాళ్లు ఈ టోర్నీ కోసం ఎంతో కష్టపడ్డాం అని చెప్పాడు.
ఇదిలా ఉంటే.. వచ్చే ఏడాది పాకిస్థాన్ వేదికగా పురుషుల ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. పాక్‌లో భారత్ పర్యటించదని బీసీసీఐ ఇప్పటికే ఐసీసీకి తెలియజేసింది. హైబ్రిడ్ మోడ్‌లో భారత మ్యాచులను నిర్వహించాలని కోరింది. దీనికి పాక్ అంగీకరించడం లేదు. ఈ పరిణామాల నేపథ్యంలో అంధుల టీ20 ప్రపంచకప్ నుంచి భారత్ వైదొలగడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
AUS vs IND : తొలి టెస్టు పిచ్‌ను చూశారా? బ్యాటర్ల వెన్నులో వణుకే.. టీమ్ఇండియాకు కష్టకాలమే?