IND vs NZ: యువ క్రికెటర్లు సర్ఫరాజ్ ఖాన్, రచిన్ రవీంద్రలను అభినందించిన సచిన్ టెండుల్కర్

నాలుగో రోజు టీమిండియా యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ 110 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. ఇది అతడి కెరీర్ లో తొలి అంతర్జాతీయ సెంచరీ. అరంగ్రేటం చేశాక నాలుగో టెస్టులోనే..

Sarfaraz Khan

Sachin Tendulkar: బెంగళూరు వేదికగా భారత్ – న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ సెంచరీ చేశాడు. అంతకు ముందు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ లో రచిన్ రవీంద్ర 134 పరుగులతో ఆకట్టుకున్నాడు. వీరిద్దరిని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ట్విటర్ వేదికగా అభినందించారు.

Also Read: Sarfaraz Khan: కివీస్‌తో తొలి టెస్టులో సెంచరీ చేసిన సర్ఫరాజ్ ఖాన్.. సెంచరీ తరువాత ఏం చేశాడో చూశారా.. వీడియో వైరల్

నాలుగో రోజు టీమిండియా యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ 110 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. ఇది అతడి కెరీర్ లో తొలి అంతర్జాతీయ సెంచరీ. అరంగ్రేటం చేశాక నాలుగో టెస్టులోనే సెంచరీ పూర్తి చేయడం విశేషం. ఈ నేపథ్యంలో సచిన్ టెండుల్కర్ సర్ఫరాజ్ ఖాన్ సెంచరీపై ప్రశంసలు కురిపించాడు. సర్ఫరాజ్ ఖాన్.. జట్టుకి అవసరమైనప్పుడు ఇలాంటి ఒక ఇన్నింగ్స్ ఆడి నీ కెరీర్ లో తొలి సెంచరీ సాధించడం చాలా గొప్ప విషయం అని సచిన్ అన్నారు. అదేవిధంగా 134 పరుగులతో ఆకట్టుకున్న న్యూజిలాండ్ ప్లేయర్ రచిన్ రవీంద్రనూ సచిన్ అభినందించారు.

Also Read: IND vs NZ Test Match: చివరి బాల్‌కు కోహ్లీ ఔట్.. రోహిత్ శర్మ రియాక్షన్ చూశారా..!

సర్పంరాజ్ ఖాన్ సెంచరీపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ స్పందించారు. గొప్ప ప్రదర్శన చేస్తున్నావ్ సర్ఫరాజ్.. నువ్వు చేసిన హార్డ్ వర్క్ కనిపిస్తోంది. నాకు చాలా ఆనందంగా ఉందని అని వార్నర్ పేర్కొన్నారు. ఇదిలాఉంటే తొలి ఇన్నింగ్స్ లో పేలవ ప్రదర్శనతో 46 పరుగులకే ఆలౌట్ అయిన టీమిండియా.. రెండో ఇన్నింగ్స్ లో రాణిస్తోంది. టీమిండియా బ్యాటర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. దీంతో టీమిండియా తొలి టెస్టులో లీడ్ లోకి వచ్చింది. ప్రస్తుతానికి టీమిండియా 402 పరుగులతో ఉంది. సర్ఫరాజ్ ఖాన్ (147), రిషబ్ పంత్ (87) బ్యాటింగ్ చేస్తున్నారు.