Sachin Tendulkar prediction : 11 ఏళ్ల క్రితం స‌చిన్ చెప్పిందే నిజ‌మైంది.. వీడియో వైర‌ల్‌

ప‌రుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ ఆదివారం సెంచ‌రీ చేసి త‌న పుట్టిన రోజును చిర‌స్మ‌ర‌ణీయం చేసుకున్నాడు

Sachin Tendulkar prediction about Virat Kohli

Sachin Tendulkar : ప‌రుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ ఆదివారం సెంచ‌రీ చేసి త‌న పుట్టిన రోజును చిర‌స్మ‌ర‌ణీయం చేసుకున్నాడు. ఈ క్ర‌మంలో వ‌న్డేల్లో క్రికెట్ దేవుడు స‌చిన్ టెండూల్క‌ర్ సాధించిన శ‌త‌కాల రికార్డును స‌మం చేశాడు. సచిన్‌, విరాట్ కోహ్లీలు ఇద్ద‌రూ కూడా వ‌న్డేల్లో 49 శ‌త‌కాలు బాదారు. ప్ర‌స్తుతం కోహ్లీ పై ప్ర‌శంస‌ల‌ వ‌ర్షం కురుస్తోంది. కాగా.. విరాట్ కోహ్లీ త‌న శ‌త‌కాల రికార్డును బ‌ద్ద‌లు కొడుతాడ‌ని స‌చిన్ టెండూల్క‌ర్ దాదాపు 11 ఏళ్ల క్రిత‌మే చెప్పాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

2012లో స‌చిన్ టెండూల్క‌ర్ అంత‌ర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించిన త‌రువాత అత‌డి అద్భుత‌మైన కెరీర్‌ను పుర‌స్క‌రించుకుని ముఖేష్ అంబానీ ఓ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఈ ఈవెంట్‌లో స‌చిన్ టెండూల్క‌ర్‌ను స‌ల్మాన్ ఖాన్ ఓ ప్ర‌శ్న అడిగారు. మీ రికార్డుల‌ను ఎవ‌రైనా బ్రేక్ చేయ‌గ‌ల‌రా..? దీని గురించి మీరు ఏమ‌ని అనుకుంటున్నారు..? అని అడిగారు.

ODI World Cup 2023 : అస‌లే ఓట‌మి బాధ‌లో ఉన్న సౌతాఫ్రికాకు బిగ్ షాక్‌..! సెమీస్‌కు ముందే ఇలా జ‌ర‌గాలా..!

ఈ ప్ర‌శ్న‌కు స‌చిన్ ఇలా స‌మాధానం ఇచ్చాడు. ‘ఆ బ‌ద్ద‌లు కొట్టేవాళ్లు ఈ రూమ్‌లోనే ఉన్నారు. రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ.. ఈ ఇద్ద‌రిలో ఎవ‌రో ఒక‌రు నా రికార్డులు బ‌ద్ద‌లు కొడుతారు. ఈ ఇద్ద‌రికి త‌ప్ప మ‌రెవ‌రికీ ఇది సాధ్యం కాద‌ని అనుకుంటున్నాను.’ అని స‌చిన్ అన్నారు.

ఆదివారం కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్ వేదిక‌గా ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 119 బంతుల్లో శ‌త‌కం చేసి స‌చిన్ వ‌న్డేల రికార్డును స‌మం చేశాడు. దీంతో అప్ప‌టి పాత వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఈ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన భార‌త్ నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 326 ప‌రుగులు చేసింది. అనంత‌రం ల‌క్ష్య ఛేద‌న‌లో 27.1 ఓవ‌ర్ల‌లో 83 ప‌రుగుల‌కు ద‌క్షిణాఫ్రికా ఆలౌటైంది. దీంతో భార‌త్ 243 ప‌రుగుల భారీ తేడాతో గెలుపొందింది.

Angelo Mathews : విచిత్ర రీతిలో ఔటైన శ్రీలంక ఆల్‌రౌండ‌ర్‌.. క్రికెట్ చ‌రిత్ర‌లో టైమ్డ్ ఔటైన తొలి ఆట‌గాడు ఇత‌డే..

ట్రెండింగ్ వార్తలు