సైనా నెహ్వాల్ అభిమానులకు ఇదొక చేదు వార్త. బ్యాడ్మింటన్ రంగంలో ఓ స్టార్ ప్లేయర్‌గా ప్రపంచ వ్యాప్తంగా పేరు సంపాదించుకున్న సైనా నెహ్వాల్.. హాస్పిటల్ పాలైందన్న వార్త వినగానే.. అభిమానులందరిలోనూ షాక్.. కానీ, అందులో కంగారుపడాల్సిన విషయమేమీ లేదు.
Read Also : రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా క్రికెటర్
ఇటీవల ఆల్ ఇంగ్లాండ్ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్ ఫైనల్ వరకూ పోరాడి పరాజయానికి గురైన సైనా.. స్విస్ ఓపెన్ టోర్నీలో పాల్గొనేందుకు నిరాకరించింది. దానికి కారణం తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతుండటమే. గ్యాస్టోఎంటరిటీస్, పాంక్రీటైటిస్‌లతో హాస్పిటల్ లో చేరినట్లు ఆమె తన ఇన్‍స్టాగ్రామ్ ఖాతా ద్వారా పోస్టు చేశారు.
‘ఇదొక బాధాకరమైన విషయం. సోమవారం నుంచి తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్నాను. ఆల్ ఇంగ్లాండ్ చాంపియన్ షిప్‌లోనూ కొన్ని మ్యాచ్‌లో బాధిస్తుండగానే ఆడాను. ఈ కారణంతోనే స్విస్ ఓపెన్ నుంచి తిరిగొచ్చేశాను. డాక్టర్లు హాస్పిటల్‌లో చేరమని చెప్పారు. త్వరలో కోలుకుంటానని ఆశిస్తున్నా’ అని పోస్టు చేశారు.