Salman Ali Agha comments viral after Pakistan lost match to India in Asia Cup 2025 super 4 stage
Salman Ali Agha : ఆసియాకప్ 2025లో భారత్ చేతిలో పాక్ రెండో సారి ఓటమిని చవిచూసింది. తొలిసారి ఓటమి అనంతరం మాట్లాడకుండా ముఖం చాటేసిన పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా ఈ సారి మాత్రం స్పందించాడు. తాము ఇంకా అత్యుత్తమ ఆట ఆడలేదన్నాడు. పవర్ ప్లేలో భారత ఆటగాళ్లు బ్యాటింగ్ చేసిన విధానంతో మ్యాచ్ తమ నుంచి దూరమైందన్నాడు.
మ్యాచ్ అనంతరం పాక్ కెప్టెన్ సల్మాన్ (Salman Ali Agha)మాట్లాడుతూ.. మేము ఇంకా మా అత్యుత్తమ ఆటను ఆడలేదు. కానీ ఆ దిశగా వెలుతున్నాము. ఇది ఓ గొప్ప మ్యాచ్ అని అఘా అన్నాడు. పవర్ ప్లేలో భారత ఓపెనర్లు విధ్వంసకర బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను తమ నుంచి తాగేసుకున్నట్లుగా చెప్పుకొచ్చాడు.
‘మేము కూడా చక్కగా బ్యాటింగ్ చేశాము. మాకు లభించిన ఆరంభానికి బట్టి 10 ఓవర్ల తరువాత ఉన్న స్థానాన్ని చూస్తే.. మేము 10 నుంచి 15 అదనపు పరుగులు చేయాల్సి ఉంది. అయినప్పటికి కూడా 170-180 స్కోరు అనేది పోరాడే లక్ష్యమే. అయితే.. పవర్ ప్లేలో భారత విధ్వంసకర బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను మా నుంచి లాగేసుకుంది. ఇదే ఇరు జట్లకు మధ్య ఉన్న వ్యత్యాసం.’ అని సల్మాన్ అన్నాడు.
ఇక బౌలర్లు దారాళంగా పరుగులు ఇస్తున్నప్పుడు వారిని మార్చాల్సి ఉంటుందన్నాడు. టీ20ల్లో ఇలా జరగడం సాధారణమేన్నాడు. ఈ మ్యాచ్‌లో ఓడిపోయినప్పటికి కూడా తమకు కొన్ని సానుకూల అంశాలు ఉన్నాయన్నాడు. ఫకర్ జమాన్, ఫర్హాన్ లు అద్భుతంగా ఆడారన్నాడు. శ్రీలంకతో మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నామని చెప్పుకొచ్చాడు.
మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. పాక్ బ్యాటర్లలో సాహిబ్జాదా ఫర్హాన్ (58) హాఫ్ సెంచరీ చేశాడు. భారత బౌలర్లలో శివమ్ దూబె రెండు వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ లు చెరో వికెట్ సాధించారు.
అనంతరం 172 పరుగుల లక్ష్యాన్ని భారత్ భారత్ 18.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి అందుకుంది. టీమ్ఇండియా బ్యాటర్లలో అభిషేక్ శర్మ (39 బంతుల్లో 74 పరుగులు), శుభ్‌మన్ గిల్ (28 బంతుల్లో 47 పరుగులు), తిలక్ శర్మ (19 బంతుల్లో 30 పరుగులు) దంచికొట్టాడరు. పాక్ బౌలర్లలో హారిస్ రౌఫ్ రెండు వికెట్లు తీయగా.. అబ్రార్ అహ్మద్, ఫహీమ్ అష్రఫ్ లు తలా ఓ వికెట్ సాధించారు.