Sania Mirza Coaches Son Izhaan In Adorable Viral Video
Sania Mirza : భారత మాజీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దేశంలో ఎంతో మంది అమ్మాయిలు ఆటల్లోకి రావడానికి స్ఫూర్తిగా నిలిచింది. కొన్నాళ్ల క్రితమే సానియా ఆటకు గుడ్ బై చెప్పింది. షోయబ్ మాలిక్‌తో విడాకుల తరువాత తన కుమారుడు ఇజాన్‌తో కలిసి దుబాయ్‌లో నివసిస్తోంది.
ఆటకు గుడ్ బై చెప్పినప్పటికి కూడా సానియా మీర్జా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
IND vs SA : సౌతాఫ్రికాతో తొలి టీ20 మ్యాచ్.. కెరీర్ మైల్‌స్టోన్ పై సంజూ శాంసన్ కన్ను..
ఆమె కొడుకు ఇజాన్ కూడా టెన్నిస్ ఆటపై మక్కువ చూపుతున్నాడు. తన తల్లి నుంచే ఓనమాలు నేర్చుకున్న అతడు ప్రస్తుతం ఆటలో మంచి నైపుణ్యం సంపాదించాడు. సానియా తన కొడుకుకు ట్రైనింగ్ ఇస్తున్న వీడియోను సానియా తల్లి నసీమా మీర్జా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
IND vs SA : దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్.. టాస్ గెలిచేందుకు సూర్యకుమార్ యాదవ్ మాస్టర్ ప్లాన్..
ప్రస్తుతం వీరిద్దరికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఇజాన్ కూడా ఓ మంచి టెన్నిస్ ఆటగాడు కావాలని సానియా అభిమానులు కోరుకుంటున్నారు.