Sania Mirza – Farah Khan: సానియా – ఫరా ఖాన్ ట్రెండింగ్ వీడియో చూశారా.. ఫ్రెండ్‌షిప్ అంటే ఇదే

సోషల్ మీడియాలో ఫుల్లీ అఫ్‌డేటెడ్ గా ఉండే సానియా.. మరో వీడియోను పోస్టు చేసి ట్రెండ్ అయిపోయారు. తన ఫ్రెండ్.. బాలీవుడ్ డైరక్టర్ తీస్ మార్ ఖాన్, మై హూ నా లాంటి హిట్ సినిమాలు అందించిన ఫరా ఖాన్‌తో కలిసి వీడియో చేశారు.

Sania Mirza – Farah Khan: సానియా – ఫరా ఖాన్ ట్రెండింగ్ వీడియో చూశారా.. ఫ్రెండ్‌షిప్ అంటే ఇదే

Sania Mirza

Updated On : August 12, 2021 / 4:46 PM IST

Sania Mirza – Farah Khan: సోషల్ మీడియాలో ఫుల్లీ అఫ్‌డేటెడ్ గా ఉండే సానియా.. మరో వీడియోను పోస్టు చేసి ట్రెండ్ అయిపోయారు. తన ఫ్రెండ్.. బాలీవుడ్ డైరక్టర్ తీస్ మార్ ఖాన్, మై హూ నా లాంటి హిట్ సినిమాలు అందించిన ఫరా ఖాన్‌తో కలిసి వీడియో చేశారు. కాసేపు కొరియోగ్రాఫర్ గా మారిన ఫరా – టెన్నిస్ స్టార్ ప్లేయర్ సానియా మీర్జా ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న ఆడియోకు బాడీని సింక్ చేస్తూ డ్యాన్స్ చేశారు.

హైదరాబాద్ లో ఉండే సానియా, ముంబైలో ఉండే ఫరాల మధ్య స్నేహం ఎలా చిగురించిందంటూ.. నెటిజన్లు అడిగే ఇంకా పలు రకాలైన ప్రశ్నలను కనిపించేలా ఆ పోస్టు ఉంది. వీటన్నిటికీ వన్ వర్డ్ రెస్పాన్ తో బ్రిలియంట్ గా తప్పించుకున్నారు.

అంత ఏజ్ గ్యాప్ ఉన్నప్పటికీ మీరు ఎలా ఫ్రెండ్స్ అయ్యారెలా.. ఒకరు స్పోర్ట్స్ నుంచి అయితే మరొకరు సినిమాల బ్యాక్‌గ్రౌండ్‌తో ఎలా కుదిరింది. మీ ఇద్దరిలో కామన్ అంశాలేంటి. వాటన్నిటికీ కౌంటర్ ఇస్తూ.. అయితే ఏంటి అనే రీతిలో రెస్పాన్స్ ఇస్తూ వీడియో పూర్తి చేశారు.

ప్రస్తుతం #QuestionsIGetAskedఅనే పదం ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండింగ్ లో ఉంది. ఇదే హ్యాష్ ట్యాగ్, సేమ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో చేసిన వీడియోను పోస్టు చేశారు సానియా మీర్జా. సెలబ్రిటీలే కాకుండా ఈ హ్యాష్ ట్యాగ్ తో చాలా మంది వీడియోలు చేస్తున్నారు. కరన్ జొహర్ ఛాట్ షోలో 2017వ సంవత్సరం ఒక ఎపిసోడ్ లో వీరిద్దరూ గెస్ట్ లుగా వెళ్లి సందడి చేశారు.