Sarfaraz Khan
India vs New Zealand 1st Test : ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ సెంచరీ చేశాడు. 110 బంతుల్లో 13 ఫోర్లు, మూడు సిక్సర్లతో సెంచరీని పూర్తి చేశాడు. అంతర్జాతీయ టెస్ట్ కెరీర్ లో సర్ఫరాజ్ ఖాన్ కు ఇదే తొలి సెంచరీ. 231 పరుగుల ఓవర్ నైట్ స్కోర్ శనివారం ఉదయం టీమిండియా బ్యాటింగ్ ప్రారంభించింది. మూడో రోజు చివరి బంతికి విరాట్ కోహ్లీ ఔట్ కావడంతో సర్ఫరాజ్ ఖాన్ తోపాటు క్రీజులోకి రిషబ్ పంత్ క్రీజులోకి వచ్చాడు. ఇద్దరూ దూకుడుగా ఆడుతున్నాడు. ఈ క్రమంలో మూడో రోజు ఆట పూర్తయ్యే సరికి 70 పరుగులు చేసిన సర్ఫరాజ్ ఖాన్.. నాల్గోరోజు ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే మరో 30 పరుగులు రాబట్టాడు. దీంతో సెంచరీ పూర్తిచేసుకున్నాడు.
Also Read: IND vs NZ Test Match: చివరి బాల్‌కు కోహ్లీ ఔట్.. రోహిత్ శర్మ రియాక్షన్ చూశారా..!
ఈ ఏడాది ప్రారంభంలో రాజ్‌కోట్‌లో ఇంగ్లండ్‌తో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. న్యూజిలాండ్ తో తొలి టెస్టులో శుభమాన్ గిల్ స్థానంలో సర్ఫరాజ్ ఖాన్ జట్టులోకి వచ్చాడు. గిల్ పూర్తిస్థాయిలో ఫిట్ గా లేకపోవడంతో చివరి నిమిషంలో సర్ఫరాజ్ కు రోహిత్ శర్మ తుది జట్టులో అవకాశం కల్పించారు. మొదటి ఇన్నింగ్స్ లో డకౌట్ అయిన సర్ఫరాజ్.. రెండో ఇన్నింగ్స్ తో సెంచరీతో తన సత్తాచాటాడు. ఈనెల ప్రారంభంలో రెస్ట్ ఆఫ్ ఇండియాతో జరిగిన ఇరానీ కప్ లో ముంబై తరపున సర్ఫరాజ్ డబుల్ సెంచరీ సాధించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో సర్ఫరాజ్ 15 సెంచరీలు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్ లో తొలి సెంచరీ కావడంతో సర్ఫరాజ్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. మైదానంలో పరుగెత్తుతూ సంతోషాన్ని వ్యక్తం చేశాడు. సహచర బ్యాటర్ రిషబ్ పంత్ సర్ఫరాజ్ ను హత్తుకొని అభినందించాడు. టీం సభ్యులు చప్పట్లు కొడుతూ అభినందనలు తెలిపారు.
భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో కేవలం 46 పరుగులకే ఆలౌట్ అయింది.
న్యూజిలాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 402 పరుగులు చేసింది.
భారత్ జట్టు రెండో ఇన్నింగ్స్ లో ఇప్పటి వరకు మూడు వికెట్లు కోల్పోయి 280 పరుగులు చేసింది. (మ్యాచ్ జరుగుతుంది).
CELEBRATION BY SARFARAZ KHAN WHEN HE COMPLETED THE MAIDEN HUNDRED 🥶 pic.twitter.com/PsbxlNya0t
— Johns. (@CricCrazyJohns) October 19, 2024
SARFARAZ KHAN SCORED HIS MAIDEN TEST CENTURY AT 90.9 STRIKE RATE. 🥶 pic.twitter.com/mHuv4gGhFz
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 19, 2024