WPL 2024 : కింగ్ ఆఫ్ బాలీవుడ్‌తో క్వీన్ ఆఫ్ క్రికెట్.. వీడియో వైర‌ల్‌

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో సీజ‌న్‌కు స‌మ‌యం ఆస‌న్న‌మైంది.

Shah Rukh Khan Meets Australia Meg Lanning Great Before Women's Premier League

Women’s Premier League 2024 : ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో సీజ‌న్‌కు స‌మ‌యం ఆస‌న్న‌మైంది. శుక్ర‌వారం సాయంత్రం నుంచి డ‌బ్ల్యూపీఎల్ రెండో సీజ‌న్ ఆరంభం కానుంది. ఐదు జ‌ట్లు క‌ప్పుకోసం పోటీ ప‌డ‌నున్నాయి. ఆరంభ సీజ‌న్‌లో ఛాంపియ‌న్‌గా నిలిచిన ముంబై ఇండియ‌న్స్, ర‌న్న‌ర‌ప్ ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్ల మ‌ధ్య తొలి మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్‌కు ముందు బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియంలో జ‌రిగే డ‌బ్ల్యూపీఎల్ రెండో సీజ‌న్ ఆరంభ వేడుక‌ల్లో బాలీవుడ్ హీరోలు షారుక్‌ ఖాన్‌, షాహిద్‌ కపూర్‌, టైగర్‌ ష్రాఫ్‌, వరుణ్‌ ధావన్‌, సిద్ధార్థ్‌ మల్హోత్ర, కార్తీక్‌ ఆర్యన్ లు ప్ర‌త్యేక ప్ర‌ద‌ర్శ‌న ఇవ్వ‌బోతున్నారు.

కాగా.. ఆరంభ పోరుకు ముందు ఢిల్లీ క్యాపిట‌ల్స్‌, ముంబై ఇండియ‌న్స్ జ‌ట్ల‌ను బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ క‌లిశాడు. ఇందుకు సంబంధించిన వీడియోల‌ను ఆయా ఫ్రాంచైజీలు పోస్ట్ చేశాయి. ముంబై కెప్టెన్ హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్‌, ఢిల్లీ క్యాపిట‌ల్స్ వైస్ కెప్టెన్ జెమిమా రోడ్రిగ్స్‌, కెప్టెన్, ఆస్ట్రేలియా లెజెండ్ మెగ్‌లానింగ్‌ల‌తో పాటు ప‌లువురు ప్లేయ‌ర్ల‌ను షారుఖ్ క‌లిశాడు.
IND vs ENG : ఇంగ్లాండ్‌కు వ‌రుస షాక్‌లు.. స్వ‌దేశానికి ప‌య‌న‌మైన‌ యువ‌ స్పిన్న‌ర్‌.. ఐదో టెస్టుకు దూరం

‘కింగ్ ఆఫ్ బాలీవుడ్’ ‘క్వీన్ ఆఫ్ క్రికెట్’ లానింగ్‌తో క‌ల‌వ‌డం ప్ర‌త్యేక ఆకర్ష‌ణ‌గా నిలిచింది. వీరిద్ద‌రు క‌లిసి షారుఖ్ ఖాన్ ఐకానికి పోజ్ చేయ‌డం ఆక‌ట్టుకుంది. షారుఖ్‌ను క‌లవ‌డం ప‌ట్ల లానింగ్ ఆనందం వ్య‌క్తం చేసింది.

ఇక డబ్ల్యూపీఎల్ సెకండ్ సీజ‌న్ విజ‌యానికి వ‌స్తే.. నేటి (శుక్ర‌వారం ఫిబ్ర‌వ‌రి 23) నుంచి మార్చి 17 వ‌ర‌కు జ‌ర‌గ‌నుంది. కేవ‌లం రెండు వేదిక‌ల్లోనే మ్యాచుల‌ను నిర్వ‌హించ‌నున్నారు. మొద‌టి 11 మ్యాచుల‌కు బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియం వేదిక కానుండ‌గా ఫైన‌ల్ స‌హ చివ‌రి 11 మ్యాచుల‌కు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వ‌నున్నాయి.

డబ్ల్యూపీఎల్ 2024 పూర్తి షెడ్యూల్ ఇదే..

మొద‌టి ద‌శ‌లో బెంగ‌ళూరులో జ‌రిగే మ్యాచులు ఇవే..
ఫిబ్రవరి 23 – ముంబయి ఇండియన్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్
ఫిబ్రవరి 24 – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs యూపీ వారియర్స్
ఫిబ్రవరి 25 – గుజరాత్ జెయింట్స్ vs ముంబయి ఇండియన్స్
ఫిబ్రవరి 26 – యూపీ వారియర్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్
ఫిబ్రవరి 27 – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs గుజరాత్ జెయింట్స్
ఫిబ్రవరి 28 – ముంబయి ఇండియన్స్ vs యూపీ వారియర్స్
ఫిబ్రవరి 29 – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ఢిల్లీ క్యాపిటల్స్
మార్చి 1 – యూపీ వారియర్స్ vs గుజరాత్ జెయింట్స్
మార్చి 2 – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ముంబయి ఇండియన్స్
మార్చి 3 – గుజరాత్ జెయింట్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్
మార్చి 4 – యూపీ వారియర్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

రెండో ద‌శ‌లో ఢిల్లీలో జ‌రిగే మ్యాచులు ఇవే..
మార్చి 5 – ఢిల్లీ క్యాపిటల్స్ vs ముంబయి ఇండియన్స్
మార్చి 6 – గుజరాత్ జెయింట్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
మార్చి 7 – యూపీ వారియర్స్ vs ముంబయి ఇండియన్స్
మార్చి 8 – ఢిల్లీ క్యాపిటల్స్ vs యూపీ వారియర్స్
మార్చి 9 – ముంబయి ఇండియన్స్ vs గుజరాత్ జెయింట్స్
మార్చి 10 – ఢిల్లీ క్యాపిటల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
మార్చి 11 – గుజరాత్ జెయింట్స్ vs యూపీ వారియర్స్
మార్చి 12 – ముంబయి ఇండియన్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
మార్చి 13- ఢిల్లీ క్యాపిటల్స్ vs గుజరాత్ జెయింట్స్
మార్చి 15 – ఎలిమినేటర్
మార్చి 17 – ఫైనల్

ట్రెండింగ్ వార్తలు