IND vs ENG : ఇంగ్లాండ్‌కు వ‌రుస షాక్‌లు.. స్వ‌దేశానికి ప‌య‌న‌మైన‌ యువ‌ స్పిన్న‌ర్‌.. ఐదో టెస్టుకు దూరం

ఇంగ్లాండ్ జ‌ట్టుకు వ‌రుస షాక్‌లు త‌గులుతున్నాయి.

IND vs ENG : ఇంగ్లాండ్‌కు వ‌రుస షాక్‌లు.. స్వ‌దేశానికి ప‌య‌న‌మైన‌ యువ‌ స్పిన్న‌ర్‌.. ఐదో టెస్టుకు దూరం

Rehan Ahmed flies back home to miss rest of series vs India

India vs England : ఇంగ్లాండ్ జ‌ట్టుకు వ‌రుస షాక్‌లు త‌గులుతున్నాయి. ఇప్ప‌టికే స్టార్ స్పిన్న‌ర్ జాక్ లీచ్ గాయంతో సిరీస్‌కు దూరం అయిన సంగ‌తి తెలిసిందే. తాజాగా యువ స్పిన్న‌ర్ రెహాన్ అహ్మ‌ద్ భార‌త్‌తో మిగిలిన టెస్టు సిరీస్‌కు అందుబాటులో ఉండ‌డం లేదు. వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల్ల అత‌డు స్వ‌దేశానికి తిరుగు ప‌య‌నం అయ్యాడు. ఈ విష‌యాన్ని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు వెల్ల‌డించింది. రాంచీ టెస్టు లో తుది జ‌ట్టులో రెహాన్‌కు చోటు ద‌క్క‌లేదు.

‘వ్య‌క్తిగ‌త కారణాల వ‌ల్ల రెహాన్ అహ్మ‌ద్ స్వ‌దేశానికి రానున్నాడు. సాధ్య‌మైనంత త్వ‌ర‌గా అత‌డు బ‌య‌లుదేర‌నున్నాడు. మ‌ళ్లీ అత‌డు ఇండియా వెళ్ల‌డు. అత‌డి స్థానంలో ఇంకో ఆట‌గాడిని ఎంపిక చేయం.’ అని ఇంగ్లాండ్ సోష‌ల్ మీడియాలో తెలిపింది.

Ravichandran Ashwin : ఇంగ్లాండ్‌పై అశ్విన్ సెంచ‌రీ.. రాంచీలో అరుదైన ఘ‌న‌త‌

గ‌తేడాది పాకిస్తాన్‌తో టెస్టు సిరీస్‌తో రెహాన్ అహ్మ‌ద్ అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. ఇప్ప‌టి వ‌ర‌కు నాలుగు టెస్టులు ఆడిన అత‌డు 18 వికెట్లు తీశాడు. ఇందులో ఓ సారి ఐదు వికెట్ల ప్ర‌ద‌ర్శ‌న సైతం ఉంది. కాగా.. భార‌త్‌తో జ‌రుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి మూడు మ్యాచుల్లో అత‌డు 11 వికెట్లు ప‌డ‌గొట్టాడు. విశాఖ‌, రాజ్‌కోట్ టెస్టుల్లో ఇంగ్లాండ్ ఓడిపోవ‌డంతో రాంచీ టెస్టులో అత‌డిపై వేటు ప‌డింది. అత‌డి స్థానంలో షోయ‌బ్ బ‌షీర్‌ను జ‌ట్టులోకి తీసుకుంది. కాగా.. ఫ్యామిలీ ఎమర్జెన్సీ నేప‌థ్యంలో అత‌డు ఇంగ్లాండ్ వెలుతున్న‌ట్లు తెలుస్తోంది.

ఇక రాంచీ టెస్టు మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి రోజు లంచ్ విరామానికి 5 వికెట్లు కోల్పోయి 112 ప‌రుగులు చేసింది. జోరూట్ (16), బెన్‌ఫోక్స్ (0) లు క్రీజులో ఉన్నారు. జాక్‌క్రాలీ (42), బెయిర్ స్టో (38) రాణించారు. బెన్ డ‌కెట్ (11), ఒలి పోప్ (0), బెన్‌స్టోక్స్ (3) లు విఫ‌లం అయ్యారు. భార‌త బౌల‌ర్ల‌లో అరంగ్రేట ఆట‌గాడు ఆకాశ్‌దీప్ మూడు వికెట్లు ప‌డ‌గొట్టాడు. అశ్విన్‌, జ‌డేజాలు ఒక్కొ వికెట్ తీశారు.

Viral video : ఏం చెప్పావురా..? దెబ్బ‌కు ప్యూజులు ఔట్ అయ్యాయి! షాహీన్ స‌మాధానానికి షాకైన అమీర్‌

కాగా.. ఇప్ప‌టికే సిరీస్‌లో 1-2తో వెనుక‌బ‌డి ఉన్న ఇంగ్లాండ్‌కు ఈ మ్యాచ్‌లో విజ‌యం సాధించ‌డం ఎంతో కీల‌కం. ఇలాంటి స‌మ‌యంలో రెహాన్ అహ్మ‌ద్ దూరం కావ‌డం ఇంగ్లాండ్ జ‌ట్టుకు గ‌ట్టి ఎదురుదెబ్బ‌గానే చెప్ప‌వ‌చ్చు.