Shami to play 2 Ranji Trophy matches to get ready for India vs Australia Tests
Team India : టీమ్ఇండియా అభిమానులకు శుభవార్త. వెటరన్ ఆటగాడు మహ్మద్ షమి రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో భారత జట్టులో పునరాగమనం చేయనున్నాడు. స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచకప్ 2023 అనంతరం గాయంతో షమీ జట్టుకు దూరం అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పూర్తి ఫిట్‌నెస్ సాధించిన అతడు రంజీట్రోఫీ బరిలో దిగేందుకు సిద్ధం అయ్యాడు.
పశ్చిమ బెంగాల్ తరుపున మహ్మద్ షమీ ఆడనున్నట్లు తెలుస్తోంది. నవంబర్ 6 నుంచి కర్ణాటక, నవంబర్ 13 నుంచి మధ్య ప్రదేశ్‌తో జరిగే మ్యాచులలో షమీ ఆడనునున్నాడు. ఈ విషయాన్ని బెంగాల్ టీమ్ మేనేజ్‌మెంట్ వెల్లడించింది. కేరళతో జరిగే మ్యాచ్‌కు షమీ అందుబాటులోకి రాలేదని, కానీ ఆ తరువాత జరిగే మ్యాచ్‌ల్లో అతడు ఆడనున్నట్లు బెంగాల్ టీమ్ ప్రధాన కోచ్ లక్ష్మీ రతన్ శుక్లా తెలిపారు.
IND vs NZ : డకౌట్ల కెప్టెన్లు.. ధోని సరసన రోహిత్ శర్మ.. అగ్రస్థానంలో కోహ్లీ..
షమీ టీమ్ఇండియాకు ఎంతో విలువైన ఆటగాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అతడి సేవలు జట్టుకు ఎంతో అవసరం. ఆసీస్ పర్యటకు వెళ్లే ముందు రెండు రంజీ మ్యాచులు ఆడాలని షమీ నిర్ణయం తీసుకున్నాడు. ఈ క్రమంలో బెంగాల్ తరుపున బరిలోకి దిగేందుకు అతడు ఉత్సాహంగా ఉన్నాడు. ఈ మ్యాచ్‌లు అతడికి మేలు చేస్తాయని ఆశిస్తున్నట్లు లక్ష్మీ రతన్ శుక్లా తెలిపారు.
కాగా.. ఇటీవల రోహిత్ శర్మ మాట్లాడుతూ.. షమీ విషయంలో తాము రిస్క్ తీసుకోదలుచుకోమని చెప్పాడు. అతడు ఫిట్‌నెస్ సాధించినప్పటికి ఆసీస్ పర్యటనకు తీసుకువెళ్లే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయన్నాడు.
IND vs NZ : ఇదేం షాట్ రా అయ్యా.. కోహ్లీ కెరీర్‌లోనే చెత్త షాట్.. సంజయ్ మంజ్రేకర్ ట్వీట్ వైరల్
ఇదిలా ఉంటే.. ఆసీస్ పర్యటనలో భారత్ ఐదు టెస్టు మ్యాచులు ఆడనుంది. నవంబర్ 22 నుంచి ఆసీస్ టూర్ ప్రారంభం కానుంది. మొదటి టెస్టు మ్యాచ్ పెర్త్ వేదికగా నవంబర్ 22 నుంచి 26 వరకు జరగనుంది. రెండో టెస్టు (పింక్ బాల్ టెస్టు ) అడిలైడ్ వేదికగా డిసెంబర్ 6 నుంచి10 వరకు, బ్రిస్బేన్ వేదికగా డిసెంబర్ 14 నుంచి 18 వరకు మూడో టెస్టు, డిసెంబర్ 26 నుంచి 30 వరకు నాలుగో డే టెస్టు, సిడ్నీ వేదికగా జనవరి 3 నుంచి 7 వరకు ఐదో టెస్టు మ్యాచ్ జరగనుంది.