IND vs NZ : ఇదేం షాట్ రా అయ్యా.. కోహ్లీ కెరీర్‌లోనే చెత్త షాట్.. సంజ‌య్ మంజ్రేక‌ర్ ట్వీట్ వైర‌ల్‌

టీమ్ఇండియా స్టార్ బ్యాట‌ర్ విరాట్ కోహ్లీ మ‌రోసారి నిరాశ‌ప‌రిచాడు.

IND vs NZ : ఇదేం షాట్ రా అయ్యా.. కోహ్లీ కెరీర్‌లోనే చెత్త షాట్.. సంజ‌య్ మంజ్రేక‌ర్ ట్వీట్ వైర‌ల్‌

Virat Kohli Plays Worst Shot Of His Career says Sanjay Manjrekar

Updated On : October 25, 2024 / 2:47 PM IST

టీమ్ఇండియా స్టార్ బ్యాట‌ర్ విరాట్ కోహ్లీ మ‌రోసారి నిరాశ‌ప‌రిచాడు. పూణే వేదిక‌గా న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో కోహ్లీ సింగిల్ డిజిట్‌కే పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. తొమ్మిది బంతులు ఎదుర్కొన్న కోహ్లి ఒక్క ప‌రుగు మాత్ర‌మే చేసి మిచెల్ శాంట్న‌ర్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. పుల్ టాస్ బాల్ ను మిడ్ వికెట్ మీదుగా ఆడాల‌నే ప్ర‌య‌త్నంలో ఔట్ అయ్యాడు. ప్ర‌స్తుతం కోహ్లీ ఔటైన తీరుపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

దిగ్గ‌జ ఆట‌గాడు అయిన కోహ్లీ కెరీర్‌లో ఇది అత్యంత చెత్త షాట్ అని ప్ర‌ముఖ కామెంటేట‌ర్ సంజ‌య్ మంజ్రేక‌ర్ ట్వీట్ చేశాడు. త‌న కెరీర్‌లోనే అత్యంత చెత్త షాట్ ఆడి ఔటైన‌ట్లు విరాట్ కే అనిపించి ఉంటుంది. ఎందుకంటే అత‌డు ఎప్పుడు నిజాయ‌తీగా, ధృఢ‌మైన ఉద్దేశంతోనే ముందుకు వ‌స్తాడు అని రాసుకొచ్చాడు.

IND vs NZ : సిన్నర్ల దెబ్బకు బ్యాటర్లు విలవిల.. నిన్న సుందర్.. నేడు శాన్‌ట్న‌ర్‌ ..

స్పిన్ ఆడ‌డంలో కోహ్లీ అవ‌స్థ‌లు

విరాట్ కోహ్లీ 2021 నుంచి స్పిన్ ఆడ‌డంలో అవ‌స్థ‌లు ప‌డుతున్నాడు. గ‌ణాంకాలు ఈ విష‌యాన్ని స్ప‌ష్టం చేస్తున్నాయి. గత మూడేళ్ల‌లో 26 ఇన్నింగ్స్‌ల్లో 21 సార్లు కోహ్లీ స్పిన్ బౌలింగ్‌లోనే ఔట్ అయ్యాడు. స్పిన్ బౌలింగ్‌లో 28 స‌గ‌టుతో 606 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. ఇందులో 10 సార్లు లెఫ్టార్మ్ ఆర్థోడాక్స్ స్పిన్‌లో వికెట్ స‌మ‌ర్పించుకోవ‌డం గ‌మ‌నార్హం.

IND vs NZ: తొలి ఇన్నింగ్స్‌లో చేతులెత్తేసిన భారత్ బ్యాటర్లు.. తక్కువ పరుగులకే ఆలౌట్.. ఆ ముగ్గురు మినహా..

ఇదిలా ఉంటే.. తొలి ఇన్నింగ్స్‌లో భార‌త జ‌ట్టు పేక‌మేడ‌లా కుప్ప‌కూలింది. 156 ప‌రుగుల‌కే ఆలౌటైంది. భార‌త బ్యాట‌ర్ల‌లో ర‌వీంద్ర జ‌డేజా (38), య‌శ‌స్వి జైస్వాల్ (30), శుభ్‌మ‌న్ గిల్ (30) లు ఫ‌ర్వాలేద‌నిపించారు.

రోహిత్ శ‌ర్మ (0), విరాట్ కోహ్లీ (1), రిష‌బ్ పంత్ (18), స‌ర్ఫ‌రాజ్ ఖాన్ (11), అశ్విన్ (4) లు ఘోరంగా విఫ‌లం అయ్యారు. కివీస్ బౌల‌ర్ల‌లో మిచెల్ శాంట్న‌ర్ ఏడు వికెట్లు తీశాడు. గ్లెన్ ఫిలిఫ్స్ రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. టిమ్ సౌథీ ఓ వికెట్ సాధించాడు.