IND vs NZ : సిన్నర్ల దెబ్బకు బ్యాటర్లు విలవిల.. నిన్న సుందర్.. నేడు శాన్‌ట్న‌ర్‌ ..

న్యూజిలాండ్ రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో స్పిన్నర్ల హవా సాగింది. కివీస్ తొలి ఇన్నింగ్స్ లో వాసింగ్టన్ సుందర్..

IND vs NZ : సిన్నర్ల దెబ్బకు బ్యాటర్లు విలవిల.. నిన్న సుందర్.. నేడు శాన్‌ట్న‌ర్‌ ..

IND vs NZ 2nd test

Updated On : October 25, 2024 / 1:44 PM IST

Washington Sundar and Mitchell Santner : ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ రెండో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో స్పినర్ల హవా కొనసాగింది. భారత్ స్పిన్ బౌలింగ్ దాటికి న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ లో 259 పరుగులకు ఆలౌట్ కాగా.. కివీస్ బౌలర్ మిచెల్ శాన్‌ట్న‌ర్‌ స్పిన్ మాయాజాలంకు భారత్ బ్యాటర్లు చేతులెత్తేశారు. వరుసగా పెవిలియన్ బాట పట్టారు. ఫలితంగా 156 పరుగులకే టీమిండియా ఆలౌట్ అయింది.

Also Read: IND vs NZ : ముగిసిన తొలి రోజు ఆట‌.. రోహిత్ శ‌ర్మ డ‌కౌట్‌.. 243 ప‌రుగులు వెన‌క‌బ‌డిన భార‌త్‌

న్యూజిలాండ్ రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో స్పిన్నర్ల హవా సాగింది. కివీస్ తొలి ఇన్నింగ్స్ లో వాసింగ్టన్ సుందర్ తన హవాను కొనసాగించాడు. సుందర్ స్పిన్ మాయాజాలంకు కివీస్ బ్యాటర్లు క్రీజులో నిలబడేందుకు నానా తంటాలు పడ్డారు. ఫలితంగా తొలి ఇన్నింగ్స్ లో సుందర్ ఏడు వికెట్లు పడగొట్టగా.. మరో స్పిన్నర్ రవిచంద్ర అశ్విన్ మూడు వికెట్లు తీశాడు. భారత్ ఇన్నింగ్స్ లోనూ న్యూజిలాండ్ స్పిన్నర్ల హవా కొనసాగింది. మిచెల్ శాంట్నర్ దెబ్బకు టీమిండియా బ్యాటర్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఎక్కువసేపు క్రీజులో నిలవలేక పోయారు. ఫలితంగా.. శాంట్నర్ ఏడు వికెట్లు పడగొట్టాడు. గ్లెన్ ఫిలిప్స్ కూడా రెండు వికెట్లు తీశాడు. దీంతో 156 పరుగులకే టీమిండియా ఆలౌట్ అయింది. ప్రస్తుతం టీమిండియా 103 పరుగుల వెనుకంజలో ఉంది.

Also Read: Shikhar Dhawan: అర్ధరాత్రి వేళ శిఖర్ ధావన్ చేసిన పనికి అంతా షాక్.. ఆందోళన వ్యక్తం చేసిన అభిమానులు