IND vs NZ : ముగిసిన తొలి రోజు ఆట.. రోహిత్ శర్మ డకౌట్.. 243 పరుగులు వెనకబడిన భారత్
టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి విఫలం అయ్యాడు.

Stumps Day 1 India trail by 243 runs in Pune test
టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి విఫలం అయ్యాడు. పూణే వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు. 9 బంతులు ఎదుర్కొన్న అతడు పరుగుల ఖాతా తెరకుండానే టిమ్ సౌథీ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరుకున్నాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోయి 16 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (6), శుభ్‌మన్ గిల్ (10) లు క్రీజులో ఉన్నారు. భారత్ ఇంకా 243 పరుగులు వెనుకబడి ఉంది. కివీస్ తొలి ఇన్నింగ్స్లో 259 పరుగులకు ఆలౌటైంది.
కివీస్‌ను తొలి ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు చేర్చామన్న ఆనందం కాసేపటిలోనే ఆవిరైంది. తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్‌కు టిమ్ సౌథీ షాకిచ్చాడు. ఇన్నింగ్స్ మూడో ఓవర్ చివరి బంతికి రోహిత్ శర్మ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. 9 బంతులు ఎదుర్కొన్న హిట్‌మ్యాన్ సున్నా స్కోరుకే పెవిలియన్‌కు చేరుకున్నాడు. దీంతో భారత్ ఒక్క పరుగే తొలి వికెట్ కోల్పోయింది. ఈ దశలో మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్, వన్‌డౌన్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ లు మరో వికెట్ పడకుండా తొలి రోజు ఆటను ముగించారు.\
సుందర్ భళా..
అంతకముందు కివీస్ తొలి ఇన్నింగ్స్లో 259 పరుగులకు ఆలౌటైంది. టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ స్పిన్నర్ల ధాటికి దాసోహమంది. ముందు తొలి మూడు వికెట్లు అశ్విన్ పడగొట్టగా.. మిగిలిన ఏడు వికెట్లను వాషింగ్టన్ సుందర్ తీశాడు. వాస్తవానికి కివీస్‌తో టెస్టు సిరీస్‌కు వాషింగ్టన్ సుందర్‌ను మొదట ఎంపిక చేయలేదు. అయితే.. తొలి టెస్టులో భారత్ ఓడిపోవడంతో వెంటనే వాషింగ్టన్ సుందర్‌ను రెండు, మూడో టెస్టుకు ఎంపిక చేశారు.
తన ఎంపికకు న్యాయం చేస్తూ సుందర్ కివీస్ పతనాన్ని శాసించాడు. కివీస్ బ్యాటర్లలో డేవాన్ కాన్వే (76), రచిన్ రవీంద్ర (65) హాఫ్ సెంచరీలతో రాణించారు. మిగిలిన వారిలో మిచెల్ శాంట్నర్ (33) ఫర్వాలేదనిపించారు. టామ్ లాథమ్ (15), విల్ యంగ్ (18), డారిల్ మిచెల్ (18), గ్లెన్ ఫిలిఫ్స్ (9) లు విఫలం అయ్యారు.
IND vs NZ : నేను ఔటైయ్యానా.. రచిన్ రవీంద్ర ఫ్యూజులు ఔట్.. సుందర్ సూపర్ బౌలింగ్..