IND vs NZ : నేను ఔటైయ్యానా.. ర‌చిన్ ర‌వీంద్ర ఫ్యూజులు ఔట్‌.. సుంద‌ర్ సూప‌ర్ బౌలింగ్‌..

దాదాపు మూడేళ్ల త‌రువాత అనూహ్యంగా టెస్టు జ‌ట్టులో స్థానం ద‌క్కించుకున్న వాషింగ్ట‌న్ సుంద‌ర్ అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చేస్తున్నాడు.

IND vs NZ : నేను ఔటైయ్యానా.. ర‌చిన్ ర‌వీంద్ర ఫ్యూజులు ఔట్‌.. సుంద‌ర్ సూప‌ర్ బౌలింగ్‌..

Washington Sundar bamboozles Rachin Ravindra with an absolute peach in Pune

Updated On : October 24, 2024 / 3:37 PM IST

IND vs NZ : దాదాపు మూడేళ్ల త‌రువాత అనూహ్యంగా టెస్టు జ‌ట్టులో స్థానం ద‌క్కించుకున్న వాషింగ్ట‌న్ సుంద‌ర్ అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చేస్తున్నాడు. త‌న బౌలింగ్‌తో కివీస్ బ్యాట‌ర్ల భ‌ర‌తం పడుతున్నాడు. పూణే వేదిక‌గా న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో త‌న బౌలింగ్‌తో డారిల్ మిచెల్‌, ర‌చిన్ ర‌వీంద్ర‌, టామ్ బ్లండెట్‌ల‌ను సుంద‌ర్ బోల్తా కొట్టించాడు.

ముఖ్యంగా ర‌చిన్ ర‌వీంద్ర‌ను ఔట్ చేసిన తీరు హైలెట్‌గా నిలిచింది. సుంద‌ర్ సూప‌ర్ బాల్‌ను ప‌సిగ‌ట్ట‌లేక‌పోయిన ర‌చిన్ ర‌వీంద్ర క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. తాను బౌల్డ్ అయిన విషయాన్ని న‌మ్మ‌క‌లేక‌పోయాడు. ర‌చిన్ ఔట్‌కు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Ravichandran Ashwin : టెస్టు క్రికెట్‌లో ర‌విచంద్ర‌న్ అశ్విన్ అరుదైన ఘ‌న‌త‌లు.. డ‌బ్ల్యూటీసీలో చ‌రిత్ర‌, సుదీర్ఘ ఫార్మాట్‌లో ఏడ‌వ బౌల‌ర్‌గా

కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 60వ ఓవ‌ర్ వాషింగ్ట‌న్ సుంద‌ర్ వేశాడు. ఈ ఓవ‌ర్‌లోని మొద‌టి బంతిని సుంద‌ర్ రౌండ్ ది వికెట్ నుంచి మిడిల్ స్టంప్ దిశ‌గా సంధించాడు. ర‌చిన్ ర‌వీంద్ర ఫ్రంట్ ఫుట్ డిఫెన్స్ చేసే ప్ర‌య‌త్నం చేశాడు. అయితే.. అద్భుతంగా లోప‌లికి ట‌ర్న్ అయిన బంతి వికెట్లను గిరాటేసింది. దీంతో రచిన్ ర‌వీంద్ర షాకైయ్యాడు. దీంతో 65 ప‌రుగుల‌తో ర‌చిన్ మైదానాన్ని వీడాడు.

ఇక ఆ త‌రువాతి ఓవ‌ర్‌లో టామ్ బ్లండేల్ (3) ను అదే త‌ర‌హాలో క్లీన్ బౌల్డ్ చేశాడు వాషింగ్ట‌న్ సుంద‌ర్. ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 70 ఓవ‌ర్ల‌కు స్కోరు 232-6. గ్లెన్ ఫిలిఫ్ (7), మిచెల్ శాంట్న‌ర్ (21) లు క్రీజులో ఉన్నారు.

Commonwealth Games 2026 : కామన్వెల్త్ క్రీడల సమాఖ్య కీల‌క నిర్ణ‌యం.. భార‌త్‌కు ఊహించ‌ని షాక్‌..