Ravichandran Ashwin : టెస్టు క్రికెట్‌లో ర‌విచంద్ర‌న్ అశ్విన్ అరుదైన ఘ‌న‌త‌లు.. డ‌బ్ల్యూటీసీలో చ‌రిత్ర‌, సుదీర్ఘ ఫార్మాట్‌లో ఏడ‌వ బౌల‌ర్‌గా

టీమ్ఇండియా సీనియర్ ఆఫ్ స్పిన్న‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ అరుదైన ఘ‌న‌త సాధించాడు.

Ravichandran Ashwin : టెస్టు క్రికెట్‌లో ర‌విచంద్ర‌న్ అశ్విన్ అరుదైన ఘ‌న‌త‌లు.. డ‌బ్ల్యూటీసీలో చ‌రిత్ర‌, సుదీర్ఘ ఫార్మాట్‌లో ఏడ‌వ బౌల‌ర్‌గా

Ravichandran Ashwin becomes leading wicket taker in WTC history

Updated On : October 24, 2024 / 4:13 PM IST

Ravichandran Ashwin : టీమ్ఇండియా సీనియర్ ఆఫ్ స్పిన్న‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ అరుదైన ఘ‌న‌త సాధించాడు. ఐసీసీ ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్‌(డ‌బ్ల్యూటీసీ)లో అత్య‌ధిక వికెట్లు తీసిన ప్లేయ‌ర్‌గా చ‌రిత్ర సృష్టించాడు. పూణే వేదిక‌గా న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో రెండు వికెట్లు ప‌డ‌గొట్ట‌డం ద్వారా అశ్విన్ ఈ ఘ‌న‌త‌ను అందుకున్నా డు. డ‌బ్ల్యూటీసీ చ‌రిత్ర‌లో అశ్విన్ 38 టెస్టులు ఆడి 188 వికెట్లను త‌న ఖాతాలో వేసుకున్నాడు.
ఈ క్ర‌మంలో ఆస్ట్రేలియా స్పిన్న‌ర్ నాథ‌న్ లైయాన్ ను అధిగ‌మించాడు. లైయాన్ 43 టెస్టుల్లో 187 వికెట్లు ప‌డ‌గొట్టాడు. వీరిద్ద‌రి త‌రువాత పాట్ క‌మిన్స్‌, మిచెల్ స్టార్క్‌, స్టువ‌ర్ట్ బ్రాడ్‌లు వ‌రుస‌గా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో కొన‌సాగుతున్నారు.

Prithvi Shaw : పృథ్వీ షాకి షాక్‌.. జ‌ట్టు నుంచి త‌ప్పించిన ముంబై.. క్ర‌మ‌శిక్ష‌ణా చ‌ర్య‌లు!

డ‌బ్ల్యూటీసీ చ‌రిత్ర‌లో అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్లు..<

ర‌విచంద్ర‌న్ అశ్విన్ (భార‌త్‌) – 38 టెస్టుల్లో 189* వికెట్లు
నాథ‌న్ లైయాన్ (ఆస్ట్రేలియా) – 43 టెస్టుల్లో 187 వికెట్లు
పాట్ క‌మిన్స్ (ఆస్ట్రేలియా) – 42 టెస్టుల్లో 175 వికెట్లు
మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా) – 38 టెస్టుల్లో 147 వికెట్లు
స్టువ‌ర్ట్ బ్రాడ్ (ఇంగ్లాండ్‌) – 33 టెస్టుల్లో 134 వికెట్లు
క‌గిసో ర‌బాడ (ద‌క్షిణాఫ్రికా) – 28 టెస్టుల్లో 132 వికెట్లు

ప్ర‌పంచ క్రికెట్‌లో ఏడో స్థానంలో.. 

ఈ మ్యాచ్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు అశ్విన్ మూడు వికెట్లు తీశాడు. ఈ క్ర‌మంలో అత‌డు ప్రపంచ టెస్టు క్రికెట్‌లో అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్ల జాబితాలో ఏడో స్థానానికి చేరుకున్నాడు. ఈ క్ర‌మంలో నాథ‌న్ లైయాన్ రికార్డును బ్రేక్ చేశాడు. లైయాన్ టెస్టుల్లో 530 వికెట్లు తీయ‌గా అశ్విన్ త‌న వికెట్ల సంఖ్య‌ను 531 కి పెంచుకున్నాడు. ముత్త‌య్య ముర‌ళీ ధ‌ర‌న్ 800 వికెట్ల‌తో టెస్టుల్లో అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్ల జాబితాలో అగ్ర‌స్థానంలో కొన‌సాగుతున్నాడు.

Commonwealth Games 2026 : కామన్వెల్త్ క్రీడల సమాఖ్య కీల‌క నిర్ణ‌యం.. భార‌త్‌కు ఊహించ‌ని షాక్‌..
టెస్టుల్లో అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్లు.. 

ముత్త‌య్య ముర‌ళీధ‌ర‌న్ (శ్రీలంక‌) – 800 వికెట్లు
షేన్‌వార్న్ (ఆస్ట్రేలియా) – 708 వికెట్లు
జేమ్స్ అండ‌ర్స‌న్ (ఇంగ్లాండ్‌) – 704 వికెట్లు
అనిల్ కుంబ్లే (భార‌త్‌) – 619 వికెట్లు
స్టువ‌ర్ట్ బ్రాడ్ (ఇంగ్లాండ్)- 604 వికెట్లు
గ్లెన్ మెక్‌గ్రాత్ (ఆస్ట్రేలియా) – 563 వికెట్లు
ర‌విచంద్ర‌న్ అశ్విన్ (భార‌త్‌) – 531 వికెట్లు

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. కివీస్ తొలుత బ్యాటింగ్ చేస్తోంది. తొలి రోజు టీ విరామానికి తొలి ఇన్నింగ్స్‌లో కివీస్ 5 వికెట్లు కోల్పోయి 201 ప‌రుగులు చేసింది. డారిల్ మిచెల్ (17), గ్లెన్ ఫిలిప్స్ (0) లు క్రీజులో ఉన్నారు.