IND vs NZ : ఏడు వికెట్లతో విజృంభించిన వాషింగ్టన్ సుందర్.. తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 259 ఆలౌట్
పూణే వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో భారత బౌలర్లు విజృంభించారు.

New Zealand 259 all out in Innings against india in pune test
IND vs NZ : పూణే వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో భారత బౌలర్లు విజృంభించారు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 259 పరుగులకు ఆలౌటైంది. వాషింగ్టన్ సుందర్ ఏడు వికెట్లతో కివీస్ పతనాన్ని శాసించగా, రవిచంద్రన్ అశ్విన్ మూడు వికెట్లు పడగొట్టాడు. కివీస్ బ్యాటర్లలో రచిన్ రవీంద్ర (105 బంతుల్లో 65), డేవాన్ కాన్వే ( 141 బంతుల్లో 76) హాఫ్ సెంచరీలు చేశారు.
టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకుంది న్యూజిలాండ్. జట్టు స్కోరు 32 పరుగుల వద్ద రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో కెప్టెన్ టామ్ లాథమ్ (15) తొలి వికెట్ గా పెవిలియన్‌కు చేరుకున్నాడు. కాసేపటికే వన్‌డౌన్‌లో వచ్చిన విల్‌యంగ్ (18)ను అశ్విన్ ఔట్ చేశాడు. దీంతో కివీస్ 76 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది.
IND vs NZ : నేను ఔటైయ్యానా.. రచిన్ రవీంద్ర ఫ్యూజులు ఔట్.. సుందర్ సూపర్ బౌలింగ్..
ఈ దశలో మరో ఓపెనర్ డేవాన్ కాన్వేకు రచిన్ రవీంద్ర జత కలిశాడు. వీరిద్దరు భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ పోటాపోటీగా బౌండరీలు బాదారు. అర్థశతకం పూర్తి చేసుకుని శతకం దిశగా దూసుకువెలుతున్న డేవాన్ క్వానేను అశ్విన్ బోల్తా కొట్టించాడు. దీంతో 62 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. కాన్వే ఔటైనా సరే రచిన్ తనదైన శైలిలో పరుగులు రాబట్టాడు. అర్థశతం పూర్తి చేసుకున్న అతడు సుందర్ అద్భుతమైన బంతికి క్లీన్‌బౌల్డ్ అయి పెవిలియన్‌కు చేరుకున్నాడు.
దీంతో 197 పరుగుల వద్ద కివీస్ నాలుగో వికెట్ కోల్పోయింది. ఇక్కడ నుంచి వాషింగ్టన్ సుందర్ హవా మొదలైంది. కివీస్ బ్యాటర్లను ముప్పు తిప్పలు పెడుతూ వికెట్లను పడగొట్టాడు. దీంతో కివీస్ మరో 62 పరుగులు జోడించి మిగిలిన ఆరు వికెట్లను కోల్పోయింది.
Innings Break!
Superb bowling display from #TeamIndia! 💪
7⃣ wickets for Washington Sundar
3⃣ wickets for R AshwinScorecard ▶️ https://t.co/YVjSnKCtlI #INDvNZ | @Sundarwashi5 | @ashwinravi99 | @IDFCFIRSTBank pic.twitter.com/TsWb5o07th
— BCCI (@BCCI) October 24, 2024