Shan Masood: ప్రపంచకప్‌లో పేలవ ప్రదర్శన.. పాకిస్థాన్ క్రికెట్ జట్టు ప్రక్షాళన

వన్డే ప్రపంచకప్‌లో విఫలమైన పాకిస్థాన్ క్రికెట్ టీమ్‌కు కొత్త కెప్టెన్ వచ్చాడు. చీఫ్ సెలక్టర్, ప్రధాన కోచ్, బౌలింగ్ కోచ్‌లు కూడా మారారు.

Shan Masood appointed as Pakistan captain

Pakistan captain: వన్డే ప్రపంచకప్‌లో సెమీస్ చేరకుండానే ఇంటిదారి పట్టిన పాకిస్థాన్ జట్టులో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. బౌలింగ్ కోచ్ మోర్నీమోర్కెల్, కెప్టెన్ బాబర్ ఆజం ఇప్పటికే తమ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ప్రధాన కోచ్ మిక్కీ ఆర్థర్, బ్యాటింగ్ కోచ్ గ్రాంట్ ఫ్లవర్ కూడా వైదొలిగారు. దీంతో జట్టును ప్రక్షాళన చేసేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) నడుంబిగించింది.

ఆస్టేలియాతో జరిగే టెస్టు సిరీస్‌కు 18 మంది సభ్యులతో కూడిన జట్టును పీసీబీ ప్రకటించింది. చీఫ్ సెలెక్టర్ వాహబ్ రియాజ్ ఈ మేరకు ప్రకటన చేశారు. షాన్ మసూద్‌ను కెప్టెన్‌గా నియమించారు. బాబర్ ఆజం ఆటగాడిగా జట్టులో కొనసాగుతాడు. సైమ్ అయూబ్, ఖుర్రం షాజాద్‌లు తొలిసారిగా జాతీయ టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నారు. ఫహీమ్ అష్రఫ్, మీర్ హమ్జా, మహ్మద్ వసీం జూనియర్ టెస్ట్ జట్టులోకి తిరిగి వచ్చారు. కాగా, చీఫ్ సెలెక్టర్ వాహబ్ రియాజ్ కూడా గతవారమే బాధ్యతలు చేపట్టాడు. చీఫ్ సెలెక్టర్‌గా అతడి ఇదే మొదటి సవాల్.

బౌలింగ్ కోచ్‌లుగా గుల్, అజ్మల్
పాకిస్థాన్ ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా ఉమర్ గుల్, స్మిన్ బౌలింగ్ కోచ్‌గా సయీద్ అజ్మల్ నియమితులయ్యారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సిరీస్‌ల‌కు పాకిస్థాన్ ప్రధాన కోచ్‌గా మహ్మద్ హఫీజ్ వ్యవహరించనున్నారు.

Also Read: 107 బంతుల్లో 66 పరుగులా.. ఏంటి రాహుల్ ఇది?- షోయబ్ మాలిక్ విమర్శలు

పాకిస్థాన్ టెస్టు జట్టు
షాన్ మసూద్ (కెప్టెన్), అమీర్ జమాల్, అబ్దుల్లా షఫీక్, అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజం, ఫహీమ్ అష్రఫ్, హసన్ అలీ, ఇమామ్-ఉల్-హక్, ఖుర్రం షాజాద్, మీర్ హమ్జా, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), మహ్మద్ వాసిమ్ జూనియర్, నోమన్ అలీ, సైమ్ అయూబ్, సల్మాన్ అలీ అఘా, సర్ఫరాజ్ అహ్మద్ (వికెట్ కీపర్), సౌద్ షకీల్, షాహీన్ ఆఫ్రిది