Shane Warne funeral : మార్చి 30న MCG వేదికగా స్పిన్ మాంత్రికుడు షేన్‌వార్న్ అంత్యక్రియలు..!

Shane Warne Funeral : ఆస్ట్రేలియా స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ అంత్యక్రియలు మార్చి 30న మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా ఘనంగా జరుగనున్నాయి.

Shane Warne Funeral Shane Warne's State Funeral To Be Held At Melbourne Cricket Ground On March 30

Shane Warne Funeral : ఆస్ట్రేలియా స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ అంత్యక్రియలు మార్చి 30న మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా ఘనంగా జరుగనున్నాయి. ఈ మేరకు ఆస్ట్రేలియా ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది. స్పిన్ మాంత్రికుడికి తుది వీడ్కోలు పలికేందుకు అంత్యక్రియల్లో పాల్గొనేందుకు సుమారుగా లక్ష మంది వరకు అభిమానులు తరలిరానున్నారు. అభిమానుల మధ్య షేన్ వార్న్ తుది వీడ్కోలు పలుకనున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను రెడీ చేస్తోంది. ఎంసీజీతో వార్న్‌కు మంచి అనుబంధం ఉంది. MCG అనేది 1994లో వార్న్ ప్రసిద్ధ యాషెస్ హ్యాట్రిక్ సాధించిన వేదిక.. అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయ్యే ముందు అతని చివరి సిరీస్‌లో 2006లో బాక్సింగ్ డేలో 700వ టెస్ట్ వికెట్ తీశాడు. ఈ నేపథ్యంలోనే వార్నర్ అంత్యక్రియలను ఇక్కడే నిర్వహించాలని విక్టోరియా రాష్ట్ర సర్వోన్నత అధికారి డేనియల్ ఆండ్రూస్ ఒక ప్రకటనలో తెలిపారు.

వార్న్ విగ్రహాన్ని కూడా ఎంసీజీ బయటే ఏర్పాటు చేయడంతో అభిమానులంతా అక్కడే నివాళులర్పించనున్నారు. షేన్ వార్న్ పార్ధివ దేహం థాయ్ లాండ్ నుంచి ఆస్ట్రేలియాకు తరలించాల్సి ఉంది. ఈనెల 4న థాయ్‌లాండ్‌లోని రిసార్ట్ ద్వీపం కోహ్ సముయ్‌లో షేన్ వార్న్ అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. వార్న్ భౌతిక కాయాన్ని ఫెర్రీలో ప్రధాన భూభాగమైన సూరత్ థానికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి సోమవారం రాత్రి థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌కు తరలించారు. అయితే వార్న్ అంత్యక్రియలను ఘనంగా జరపాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగానే ఈనెల 30వ తేదీన వార్న్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.

1969 సెప్టెంబర్ 13న ఆస్ట్రేలియాలోని విక్టోరియా గ్రామంలో షేన్ వార్న్ జన్మించాడు. అండర్-19 విభాగం నుంచి జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. 1992లో సిడ్నీ వేదికగా టీమిండియాతో జరిగిన టెస్ట్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి వార్న్ అరంగేట్రం చేశాడు. స్పిన్నింగ్ మాయాజాలంతో పదిహేనేళ్ల పాటు తనదైన శైలిలో ఆటలో రాణించాడు. మొత్తం 145 టెస్ట్‌ల్లో 708 వికెట్లు, 194 వన్డేల్లో 293 వికెట్లు తీశాడు. లంక దిగ్గజ స్పిన్నర్‌ ముత్తయ్య మురళీధరన్‌ (1347) తర్వాత వెయ్యి వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా షేన్ వార్న్ రికార్డు నెలకొల్పాడు.

Read Also : Shane Warne: షేన్ వార్న్ మరణం వెనుక నిజాలు బయటపెట్టిన అటాప్సీ రిపోర్ట్