పాకిస్తాన్ జట్టుకు కోచ్‌గా ఉండేందుకు నిరాకరించిన షేన్ వాట్సన్.. ఎందుకంటే?

షేన్ వాట్సన్ కు ఐపీఎల్, ప్రధాన యూఎస్ఏ లీగ్ లో కామెంటేటర్ గా ముందుగానే ఒప్పందాలు కలిగి ఉండటంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఆఫర్ ను తిరస్కరించినట్లు తెలుస్తోంది.

shane watson

Shane Watson : పాకిస్థాన్ జాతీయ జట్టుకు విదేశీ కోచ్ కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చేస్తున్న ప్రయత్నాలకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. వెస్టిడీస్, యూఎస్ఏలో జరిగే ప్రపంచ టీ20 కప్, వచ్చే ఏడాది ప్రారంభంలో పాకిస్థాన్ లో జరిగే ఛాంపియన్స్ ట్రోపీతోపాటు దీర్ఘకాల ప్రాతిపదికన జాతీయ జట్టుకు విదేశీ కోచ్ లను నియమించాలని భావిస్తున్నట్లు ఇటీవల పీసీబీ చైర్మన్ సయ్యద్ మొహ్సిన్ నఖ్వీ తెలిపారు. అయితే, ఆస్ట్రేలియన్ మాజీ ఆల్ రౌండర్ షేన్ వాట్సన్, వెస్టిండీస్ మాజీ కెప్టెన్ డారెన్ సామీ పేర్లు తెరపైకి వచ్చాయి. డారెన్ సామీ వెస్టడీస్ వైట్ బాల్ జట్టుకు ప్రధాన కోచ్ గా వెస్టండీస్ బోర్డుతో ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకోవటంతోపాటు పీసీబీ విధానాలను సామీ తిరస్కరించినట్లు తెలిసింది. మరోవైపు వాట్సన్ సైతం పాకిస్తాన్ బోర్డు ప్రతిపాదనను తిరస్కరించాడు.

Also Read : విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన ఆర్సీబీ ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్.. ఎలా అంటే?

షేన్ వాట్సన్ కు ఐపీఎల్, ప్రధాన యూఎస్ఏ లీగ్ లో కామెంటేటర్ గా ముందుగానే ఒప్పందాలు కలిగి ఉండటంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఆఫర్ ను తిరస్కరించినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ జట్టుకు కోచ్ గా వస్తే.. ఏడాదికి రూ. 17కోట్లు ఇస్తామని పీసీబీ ఆఫర్ చేసినట్లు తెలిసింది. వాట్సన్, డారెన్ సామీతో పాటు కోచ్ రేసులో పాకిస్థాన్ మాజీ కెప్టెన్లు యూనిస్ ఖాన్, ముహమ్మద్ యూసుఫ్, ఇంజమామ్ ఉల్ హక్, మొయిన్ ఖాన్ పేర్లు ఉన్నాయట. విదేశీ కోచ్ నియామకం ప్రయత్నం విఫలం అయితే.. పాక్ మాజీ కెప్టెన్లలో ఎవరినో ఒకరిని జట్టు ప్రధాన కోచ్ గా నియమించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read : ముంబై జట్టు కెప్టెన్‌గా రోహిత్‌ను తొలగించడంపై తొలిసారి స్పందించిన హార్ధిక్ పాండ్యా

 

 

 

ట్రెండింగ్ వార్తలు