Lucknow Super Giants
Shardul Thakur IPL 2025: ఐపీఎల్ -2025 టోర్నీ శనివారం (22వ తేదీ) ప్రారంభమవుతుంది. టోర్నీ ప్రారంభానికి ఒక్కరోజే మిగిలిఉన్న వేళ రిషబ్ పంత్ సారథ్యం వహిస్తున్న లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ టోర్నీలో లక్నో జట్టు తొలి మ్యాచ్ ను ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో ఈనెల 24న ఆడనుంది. అయితే, ఈ జట్టులో బౌలర్లను గాయాల బెడద వేదిస్తోంది. ఈ క్రమంలో ఆ జట్టు యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read: IPL 2025: ఆర్సీబీని వీడటంపై మహమ్మద్ సిరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. విరాట్ గురించి ఏమన్నాడంటే..
ఓ నివేదిక ప్రకారం.. లక్నో జట్టులోకి ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. లక్నో జట్టు బౌలర్ మొహ్సిన్ ఖాన్ గాయం కారణంగా జట్టుకు దూరమైనట్లు తెలుస్తోంది. అతని స్థానంలో శార్దూల్ ఎంట్రీ ఇస్తున్నాడట. గాయం కారణంగా మోహ్సిన్ ఖాన్ చాలాకాలంగా మైదానానికి దూరంగా ఉన్నాడు. ప్రస్తుతానికి అతను తిరిగి జట్టులో చేరడం కష్టమని, ఐపీఎల్ సీజన్ మొత్తానికి అతను దూరంగా ఉండొచ్చునని వార్తలు వస్తున్నాయి.
టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. లక్నో జట్టులో మొహ్సిన్ స్థానంలో శార్దూల్ ఠాకూర్ చేరబోతున్నారు. మొహ్సిన్ తోపాటు మయాంక్ యాదవ్ కూడా గాయాలతో ఇబ్బంది పడుతున్నాడు. అయితే, మయాంక్ తుది జట్టులో చేరే అవకాశాలు ఉన్నప్పటికీ.. మొహ్సిన్ ఖాన్ మాత్రం టోర్నీకి దూర కానున్నట్లు సమాచారం. దీంతో అతని స్థానంలో లక్నో జట్టు శార్దూల్ ఠాకూర్ ను తీసుకునేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఇప్పటికే ప్రక్రియ పూర్తయినట్లు తెలుస్తోంది. ఇవాళ లేదా రేపు లక్నో యాజమాన్యం అధికారిక ప్రకటన చేస్తుందని సమాచారం.
Caution: Rishabh Panti ahead ⚠ pic.twitter.com/q01UgzUCbh
— Lucknow Super Giants (@LucknowIPL) March 21, 2025
ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ ఐపీఎల్ ఆటగాళ్ల వేలంలో అమ్ముడుపోలేదు. ఏ జట్టులోకి శార్దూల్ ను తీసుకోలేదు. అయితే, లక్నో సూపర్ జెయింట్స్ జట్టు గాయపడిన బౌలర్ స్థానంలో శార్దూల్ ను తీసుకునేందుకు సిద్ధమైంది. అయితే, ఆదివారం లక్నో జట్టు శిక్షణ శిభిరంలో ఆ జట్టు జెర్సీతో శార్దూల్ కనిపించడంతోపాటు హోలీ వేడుకల్లో జట్టు సభ్యులతో పాల్గొన్నాడు. దీంతో శార్దూల్ లక్నో జట్టులోకి ఎంట్రీ ఇస్తున్నాడని వార్తలు వచ్చాయి. తాజాగా.. మొహ్సిన్ ఖాన్ స్థానంలో అతను ఈ ఐపీఎల్ లో లక్నో జట్టు తరపున ఆడటం ఖాయంగా కనిపిస్తుంది.
🚨 LORD THAKUR IN IPL. 🚨
– Shardul Thakur likely to replace Mohsin Khan in LSG for IPL 2025. (TOI). pic.twitter.com/ajJjh8D5wK
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 21, 2025