IPL 2025: రోహిత్ శర్మతో ఓపెనర్ గా వచ్చేది ఎవరు..? మీడియా ప్రశ్నకు హార్దిక్ పాండ్యా కీలక కామెంట్స్.. మా జట్టులో ముగ్గురు కెప్టెన్లు..

మరో రెండు రోజుల్లో ఐపీఎల్ టోర్నీ ప్రారంభమవుతున్న వేళ ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా మీడియా సమావేశంలో మాట్లాడారు..

IPL 2025: రోహిత్ శర్మతో ఓపెనర్ గా వచ్చేది ఎవరు..? మీడియా ప్రశ్నకు హార్దిక్ పాండ్యా కీలక కామెంట్స్.. మా జట్టులో ముగ్గురు కెప్టెన్లు..

Hardik Pandya

Updated On : March 20, 2025 / 8:08 AM IST

Hardik Pandya: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2025) టోర్నీ ఈనెల 22 నుంచి ప్రారంభమవుతుంది. అన్ని జట్లు టోర్నీలో సత్తాచాటేందుకు సంసిద్ధమవుతున్నాయి. ఐపీఎల్ లో రికార్డు స్థాయిలో అయిదు టైటిళ్లను రోహిత్ శర్మ సారథ్యంలో ముంబయి ఇండియన్స్ గెలుచుకున్న విషయం తెలిసిందే. గత నాలుగేళ్లలో ఒక్కటంటే ఒక్క కప్పూ గెలవలేదు. గత సీజన్ లో హార్దిక్ పాండ్యా సారథ్యంలో ఆ జట్టు ఘోర వైఫల్యం చెందింది. అయితే, ఈసారికూడా హార్దిక్ సారథ్యంలో బరిలోకి దిగుతున్న ముంబై జట్టు మరోసారి టోర్నీ విజేతగా నిలవాలని పట్టుదలతో ఉంది. మరో రెండు రోజుల్లో ఐపీఎల్ టోర్నీ ప్రారంభమవుతున్న వేళ హార్ధిక్ పాండ్యా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా మీడియా ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు.

Also Read: IPL 2025: ధోనీ బ్రో ఇలా ఆడితే ఎలా..! ప్రాక్టీస్ మ్యాచ్‌లో ధోనీ హెలికాప్టర్ షాట్ చూశారా.. వీడియో వైరల్

ముంబై ఇండియన్స్ జట్టు చరిత్ర ప్రశంసనీయమని హార్దిక్ పాండ్యా అన్నారు. ఈ జట్టు అభిమానుల అంచనాలు ఎల్లప్పుడూ చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ అంచనాలను అందుకోవడం సవాలుతో కూడుకున్నది. కానీ, కెప్టెన్ గా నేను ఆ సవాలును ఆస్వాదించాను. ఈ సమయంలో నా దృష్టి నా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడంపైనే ఉందని చెప్పారు.

Also Read: IPL 2025లో 10 మంది కెప్టెన్లలో కాస్ట్లీయస్ట్‌ కెప్టెన్‌ ఎవరు? అతి తక్కువ ఎవరికి? ఫుల్‌ డీటెయిల్స్..

హార్దిక్ మాట్లాడుతూ.. మా జట్టుకు ముగ్గురు కెప్టెన్లు ఉండటం నా అదృష్టం అంటూ వ్యాఖ్యానించారు. సూర్యకుమార్ యాదవ్ టీమిండియాకు కెప్టెన్ గా వ్యవహరించారు.. ఈ సీజన్ ముంబై ఇండియన్స్ జట్టు మొదటి మ్యాచ్ లో సూర్యకుమార్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. మరోవైపు రోహిత్ శర్మ, జస్ర్పీత్ బుమ్రా రూపంలో మొత్తం ముగ్గురు కెప్టెన్లు ఉండటం నా అదృష్టం. వారు ఎల్లప్పుడూ నాకు సలహాలు సూచనలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంటారని అన్నారు.

 


రోహిత్ శర్మతో పాటు ఓపెనర్ గా ఎవరు క్రీజులోకి వస్తారని హార్దిక్ ను మీడియా ప్రశ్నించగా.. పరిస్థితిని బట్టి ఈ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇదే సమయంలో తన బ్యాటింగ్ ఆర్డర్ గురించి హార్డిక్ మాట్లాడాడు. నా కెరీర్ లో నేను ఎప్పుడూ బ్యాటింగ్ ఆర్డర్ కు పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వలేదు. పరిస్థితులకు అనుగుణంగా బ్యాటింగ్ ఆర్డర్ మార్చడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను. నా ఆటలో నిర్దిష్ట బ్యాటింగ్ ఆర్డర్ లేదు. నా జట్టుకు అవసరమైతే నేు 4వ స్థానంలో బ్యాటింగ్ చేస్తాను. అలాకాకుండా.. నేను ఏడో స్థానంలో అవసరమైతే నేను ఆ నంబర్ లో బ్యాటింగ్ కు వెళ్లేందుకు సిద్ధంగా ఉంటానని హార్దిక్ పేర్కొన్నాడు.