IPL 2025లో 10 మంది కెప్టెన్లలో కాస్ట్లీయస్ట్ కెప్టెన్ ఎవరు? అతి తక్కువ ఎవరికి? ఫుల్ డీటెయిల్స్..
ఐపీఎల్ కెప్టెన్లలో ఎవరికి ఎంత?

IPL 2025
క్రికెట్ ప్రేమికులను అలరించడానికి ఇండియన్ ప్రీమియర్ లీగ్ – 2025 సిద్ధమవుతోంది. ఇప్పటికే అన్ని ఫ్రాంచైజీలు తమ జట్టును, కెప్టెన్ల పేర్లను ప్రకటించాయి. కొన్ని ఫ్రాంచైజీలు అనుభవం బాగా ఉన్న ఆటగాళ్లను కెప్టెన్లుగా పెట్టుకున్నాయి. ఐపీఎల్‌లో మొత్తం 10 జట్లు ఆడుతున్నాయి. మార్చి 22 నుంచి మే 25 వరకు 13 వేదికలలో 74 మ్యాచ్‌లు జరగనున్నాయి.
మొత్తం 10 జట్ల కెప్టెన్లలో అత్యధిక ధర పలికిన కెప్టెన్‌గా లక్నో సూపర్ జెయింట్స్ రిషబ్ పంత్, అత్యల్ప ధర పలికిన కెప్టెన్‌గా అజింక్యా రహానె ఉన్నారు. రిషబ్ పంత్ వేలంలో ఐపీఎల్ చరిత్రలోనే రికార్డు స్థాయిలో రూ.27 కోట్ల ధర పలికాడు. ఇక అజింక్యా రహానెకు కెప్టెన్లలోనే అత్యల్పంగా రూ.1.5 కోట్లు దక్కాయి.
ఐపీఎల్ కెప్టెన్లలో ఎవరికి ఎంత?
లక్నో సూపర్ జెయింట్స్: ఐపీఎల్ 2025 వేలంలో టీమిండియా వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్‌ను ఎల్‌ఎస్‌జీ రూ.27 కోట్లకు కొనుగోలు చేసింది. ఎల్‌ఎస్‌జీ కెప్టెన్‌గా అతడినే నియమించింది.
పంజాబ్ కింగ్స్: శ్రేయాస్ అయ్యర్‌ను ఐపీఎల్ 2025 వేలంలో పీబీకేఎస్ రూ.26.75 కోట్లకు కొనుగోలు చేసింది. పీబీకేఎస్ కెప్టెన్‌గా అతడిని నియమించింది.
సన్‌రైజర్స్ హైదరాబాద్: పాట్ కమిన్స్‌ను ఎస్‌ఆర్‌హెచ్ ఈ సారి రూ.18 కోట్లకు కొనుగోలు చేసింది. అతడే ఆ టీమ్ కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. ఐపీఎల్ 2024 వేలంలో అతడిని ఇదే టీమ్ రూ.20.50 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
చెన్నై సూపర్ కింగ్స్: ఐపీఎల్ 2025 సీజన్ సీఎస్‌కే కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్‌ను ఆ ఫ్రాంచైజీ నియమించింది. సీఎస్‌కే గైక్వాడ్‌ను రూ.18 కోట్లకు కొనుగోలు చేసింది.
రాజస్థాన్ రాయల్స్: సంజు సాంసన్‌ను రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా కొనసాగిస్తోంది. అతడిని రూ.18 కోట్లకు కొనుగోలు చేసింది.
ఢిల్లీ క్యాపిటల్స్: అక్షర్ పటేల్ ఢిల్లీ టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అతడిని ఆ జట్టు రూ.16.50 కోట్లకు కొనుగోలు చేసింది.
గుజరాత్ టైటాన్స్: శుభ్‌మన్ గిల్‌ను గుజరాత్ జట్టు తమ కెప్టెన్‌గా కొనసాగిస్తోంది. అతడిని రూ.16.5 కోట్లకు కొనుగోలు చేసింది.
ముంబై ఇండియన్స్: హార్దిక్ పాండ్యాను ముంబై జట్టు తమ కెప్టెన్‌గా కొనసాగిస్తోంది. అతడిని రూ.16.35 కోట్లకు కొనుగోలు చేసింది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఆర్సీబీ తమ కెప్టెన్‌గా రజత్ పాటిదార్‌ను నియమించింది. అతడిని రూ.11 కోట్లతో కొనుగోలు చేసింది.
కోల్‌కతా నైట్ రైడర్స్: అజింక్యా రహానేను కోల్‌కతా తమ కెప్టెన్‌గా నియమించింది. రహానేను రూ.1.5 కోట్లకు కొనుగోలు చేసింది.