IPL 2025: విధి భయ్యా.. దీన్నే విధి అంటారు.. అప్పట్లో ఇతడు కోహ్లీ టీమ్‌మేట్‌.. ఇప్పుడేమో విరాట్ హీరో.. ఇతడేమో..

అటువంటి మ్యాచును గెలిపించిన తన్మయ్ శ్రీవాస్తవకు ఆ తర్వాత అవకాశాలు దక్కలేదు.

IPL 2025: విధి భయ్యా.. దీన్నే విధి అంటారు.. అప్పట్లో ఇతడు కోహ్లీ టీమ్‌మేట్‌.. ఇప్పుడేమో విరాట్ హీరో.. ఇతడేమో..

Updated On : March 19, 2025 / 4:58 PM IST

జీవిత ప్రయాణంలో విధి మనల్ని ఏ దిశగా తీసుకుపోతుందో ఎవరూ చెప్పలేరు. క్రీడల్లో కెరీర్లు ఎలా మలుపులు తిరుగుతాయో కూడా ఎవరమూ చెప్పలేం. ఇందుకు ఉదాహరణే టీమిండియా విరాట్ కోహ్లీ మాజీ టీమ్‌మేట్‌ తన్మయ్ శ్రీవాత్సవ.


Tanmay Srivastava

అప్పట్లో అండర్-19 ప్రపంచ కప్‌-2008లో విరాట్ కోహ్లీ ఆటతీరుపై ఎంతగా ప్రశంసలు వచ్చాయో చాలా మందికి ఇప్పటికీ గుర్తుండే ఉంటుంది. అలాగే, అదే ప్రపంచ కప్‌ ఫైనల్‌లో తన్మయ్ శ్రీవాత్సవ అద్భుతంగా ఆడాడు.

కోహ్లీ సహా మిగతా బ్యాటర్లు అందరూ తక్కువ పరుగులకు వెనుదిరగగా తన్మయ్ శ్రీవాస్తవ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి 46 రన్స్ బాదాడు. ఆ మ్యాచులో తన్మయ్‌ టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఆ మ్యాచులో టీమిండియా 159 పరుగులయినా చేయగలిగిందంటే దానికి తన్మయ్ శ్రీవాస్తవనే ప్రధాన కారణం.

Also Read: చాహల్ విడాకులు.. ధనశ్రీకి భరణం ఇచ్చేందుకు సిద్ధం.. ఎన్ని కోట్లంటే..

ఆ మ్యాచులో ప్రత్యర్థి జట్టు దక్షిణాఫ్రికా 160 పరుగులను లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. దక్షిణాఫ్రికా స్కోరు 103/8 వద్ద వాన పడింది. డక్‌వర్త్‌ లూయిస్ పద్ధతిలో భారత జట్టు 12 పరుగుల తేడాతో గెలిచింది.

అటువంటి మ్యాచును గెలిపించిన తన్మయ్ శ్రీవాస్తవకు ఆ తర్వాత అవకాశాలు దక్కలేదు. కోహ్లీ మాత్రం టీమిండియాలోకి వచ్చి అదరగొట్టేశాడు. తన్మయ్ శ్రీవాత్సవ అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు. 5 సంవత్సరాల క్రితం అతడు ఆటకు వీడ్కోలు పలికాడు.

ఇప్పుడు విరాట్ కోహ్లీ ఐపీఎల్‌ 2025లోనూ ఆడుతుండగా తన్మయ్ శ్రీవాస్తవ ఇదే ఐపీఎల్‌ సీజన్‌కు అంపైర్‌గా వస్తున్నాడు. తన్మయ్ శ్రీవాస్తవ వ్యాఖ్యాతగానూ కొనసాగాడు. యూపీ క్రికెట్ అసోసియేషన్ తన్మయ్ శ్రీవాస్తవకు ఆల్‌ ది బెస్ట్ చెబుతూ ఓ ట్వీట్ చేసింది. మరోసారి యూపీ గర్వించేలా చేశాడని పేర్కొంది.