Chahal: చాహల్ విడాకులు.. ధనశ్రీకి భరణం ఇచ్చేందుకు సిద్ధం.. ఎన్ని కోట్లంటే..

సుమారు 18 నెలలుగా విడిగా జీవిస్తున్నట్లు తెలుస్తోంది.

Chahal: చాహల్ విడాకులు.. ధనశ్రీకి భరణం ఇచ్చేందుకు సిద్ధం.. ఎన్ని కోట్లంటే..

Yuzvendra Chahal, Dhanashree Verma

Updated On : March 19, 2025 / 4:43 PM IST

టీమిండియా స్పిన్నర్‌ యుజ్వేంద్ర చాహల్‌ విడాకులు తీసుకుంటున్నారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రచారం నిజమేనని తేలిపోయింది. తన భార్య ధనశ్రీ వర్మకు భరణంగా రూ. 4.75 కోట్లు చెల్లించడానికి చాహల్ అంగీకరించాడని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

చాహల్‌, ధనశ్రీ వర్మకు 2020లో వివాహం జరిగింది. కొంతకాలంగా వారిద్దరు విడిగా ఉంటున్నారు. విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కారు. విడాకుల మంజూరు వేళ 6 నెలల కూలింగ్ పీరియడ్ ఉంటుంది. ఆ కూలింగ్ పీరియడ్ నుంచి ఈ జంటకు మినహాయింపు ఇచ్చేలా ఇవాళ బాంబే హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.

ధనశ్రీకి మొత్తం రూ.4.75 కోట్లు ఇవ్వడానికి కొన్ని వారాల క్రితమే చాహల్ ఒప్పుకోగా, ఇప్పటివరకు అందులో 2.37 కోట్లు మాత్రమే చెల్లించినట్లు జాతీయ మీడియా తెలిపింది. దీంతో మొదట ఆరు నెలల కూలింగ్ పీరియడ్‌ను మినహాయించాలన్న చాహల్‌ విజ్ఞప్తిని ఫ్యామిలీ కోర్టు తిరస్కరించింది. దీనిపై చాహల్ బాంబే హై కోర్టుకు వెళ్లాడు. దీంతో అతడిని అనుకూలంగా తీర్పు వచ్చింది.

ఈ విధంగా ఫ్యామిలీ కోర్టులో ఈ కూలింగ్ పీరియడ్ నుంచి చాహల్, ధనశ్రీకి మినహాయింపు దక్కింది. కూలింగ్-ఆఫ్ పీరియడ్ అంటే ఒక జంట చట్టబద్ధంగా విడాకులు తీసుకోవడానికి ముందు వేచి ఉండాల్సిన వ్యవధి. హిందూ వివాహ చట్టం ప్రకారం పరస్పర అంగీకారంతో విడాకుల కోసం దాఖలు చేసే జంటలు కోర్టు నుంచి విడాకులు తీసుకోవాలనుకుంటే అందుకు ఆరు నెలలు వేచి ఉండాలి.

ఈ వ్యవధిలో ఆ జంట తమ విడాకుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఆ జంటకు కౌన్సెలింగ్‌ కూడా ఇస్తారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ తరఫున యుజ్వేంద్ర చాహల్ ఆడాల్సి ఉంది. దీంతో చాహల్, ధనశ్రీ వర్మ విడాకుల పిటిషన్‌పై మార్చి 20లోగా నిర్ణయం తీసుకోవాలని ఫ్యామిలీ కోర్టును హైకోర్టు ఆదేశించింది.

చాహల్, ధన్యశ్రీ వర్మ 2020 డిసెంబరులో వివాహం చేసుకుని, 2023 ఫిబ్రవరిలో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశారు. సుమారు 18 నెలలుగా విడిగా జీవిస్తున్నట్లు తెలుస్తోంది. బాంద్రా ఫ్యామిలీ కోర్టులో జరిగిన విచారణకు గతంలో చాహల్‌, ధనశ్రీ వ్యక్తిగతంగా హాజరయ్యారని సమాచారం. వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చినప్పటికీ వారు విడిపోవడానికే నిర్ణయించున్నట్లు తెలుస్తోంది.