IPL 2025: ధోనీ బ్రో ఇలా ఆడితే ఎలా..! ప్రాక్టీస్ మ్యాచ్‌లో ధోనీ హెలికాప్టర్ షాట్ చూశారా.. వీడియో వైరల్

ప్రాక్టీస్ సెషన్ లో మహేంద్ర సింగ్ ధోనీ కొట్టిన హెలికాప్టర్ షాట్ కు సంబంధించిన వీడియోను చూసిన నెటిజన్లు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు.

IPL 2025: ధోనీ బ్రో ఇలా ఆడితే ఎలా..! ప్రాక్టీస్ మ్యాచ్‌లో ధోనీ హెలికాప్టర్ షాట్ చూశారా.. వీడియో వైరల్

MS Dhoni

Updated On : March 19, 2025 / 8:59 AM IST

IPL 2025 MS Dhoni: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL-2025) 18వ ఎడిషన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. అన్నిజట్ల ఆటగాళ్లు ప్రాక్టీస్ మొదలు పెట్టారు. ఈసారి లీగ్ లో 43ఏళ్ల ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నుంచి అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌గా బరిలోకి దిగబోతున్నాడు. వారం క్రితమే చెన్నైకు చేరుకున్న ధోనీ.. ప్రాక్టీస్ సైతం మొదలు పెట్టాడు. సీఎస్కే శిబిరంలో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు.

Also Read: MS Dhoni : ‘యానిమ‌ల్‌’గా మారిన ధోని.. సందీప్ రెడ్డి వంగాతో క‌లిసి.. వీడియో వైర‌ల్‌..

ఈనెల 22 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్ టోర్నీలో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చెన్నై వేదికగా 23వ తేదీన తన తొలి మ్యాచ్ ను ముంబై ఇండియన్స్ జట్టుతో ఆడనుంది. గత మూడురోజుల క్రితం ప్రాక్టీస్ సెషన్ లో ధోనీ సిక్స్ కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే, తాజాగా.. మరోసారి మహేంద్ర సింగ్ ధోనీ సిక్స్ కొట్టిన వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోలో ధోనీ తనకే సాధ్యమైన హెలికాప్టర్ షాట్ ను కొట్టాడు. చెపాక్ లో ప్రాక్టీస్ సమయంలో చెన్నై జట్టుకే చెందిన మతీషా పతిరనా బౌలింగ్ లో ధోనీ ఈ షాట్ కొట్టాడు. పతిరానా యార్కర్ వేయగా.. ధోనీ బలంగా హెలికాప్టర్ షాట్ కొట్టాడు. దీంతో బాల్ బౌండరీ లైన్ అవతల పడింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Also Read: Junaid Zafar Khan : మ్యాచ్ ఆడుతూ ఆస్ట్రేలియాలో మ‌ర‌ణించిన పాక్ సంత‌తికి చెందిన క్రికెట‌ర్‌.. ఎండ దెబ్బతో..!

ప్రాక్టీస్ సెషన్ లో ధోనీ హెలికాప్టర్ షాట్ కొట్టిన వీడియోను చూసిన క్రికెట్ అభిమానులు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. ఓ నెటిజన్.. ధోనీ బ్రో ఇలా ఆడితే ఎలా.. ఐపీఎల్-2025లో నీ కొట్టుడికి బౌలర్లు తట్టుకుంటారా.. అంటూ పేర్కొనగా.. మరికొందరు నెటిజన్లు స్పందిస్తూ.. ధోనీ భయ్యా.. ఇదేతరహా షాట్లతో ఈసారి ఐపీఎల్ లో సిక్సర్ల మోత మోగించాలి.. అంటూ పేర్కొన్నారు.

 


చెన్నై సూపర్ కింగ్స్ జట్టు..
బ్యాటర్లు: డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రాహుల్ త్రిపాఠి, దీపక్ హుడా, విజయ్ శంకర్
ఆల్ రౌండర్లు: శివమ్ దూబే, రవీంద్ర జడేజా, సామ్ కర్రన్
వికెట్ కీపర్: ఎంఎస్ ధోనీ
బౌలర్లు: ఆర్ అశ్విన్, నూర్ అహ్మద్, నాథన్ ఎల్లిస్, మతీషా పతిరానా, సిత్ వాన్ ఎల్లిస్, ఖలీష్ పతిరనా, ఖలీల్రే అహ్మద్. రషీద్, రామకృష్ణ ఘోష్, శ్రేయాస్ గోపాల్, అన్షుల్ కాంబోజ్, గుర్జప్నీత్ సింగ్, ముఖేష్ చౌదరి, కమలేష్ నాగర్కోటి

 

ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ షెడ్యూల్ ఇదే..
మార్చి 23న – ముంబై ఇండియ‌న్స్‌తో – చెన్నైలో – రాత్రి 7.30 గంట‌ల‌కు
మార్చి 28న – రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుతో – చెన్నైలో – రాత్రి 7.30 గంట‌ల‌కు
మార్చి 30న – రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌తో – గౌహ‌తిలో – రాత్రి 7.30 గంట‌ల‌కు
ఏప్రిల్ 5న – ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో – చెన్నైలో – మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు
ఏప్రిల్ 8న – పంజాబ్ కింగ్స్ – న్యూ చంఢీగ‌డ్‌లో – రాత్రి 7.30 గంట‌ల‌కు
ఏప్రిల్ 11న – కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌తో – చెన్నైలో – రాత్రి 7.30 గంట‌ల‌కు
ఏప్రిల్ 14 న‌- ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌తో – ల‌క్నోలో – రాత్రి 7.30 గంట‌ల‌కు
ఏప్రిల్ 20న – ముంబై ఇండియ‌న్స్‌తో – ముంబైలో – రాత్రి 7.30 గంట‌ల‌కు
ఏప్రిల్ 25న – స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌త్ – చెన్నైలో – రాత్రి 7.30 గంట‌ల‌కు
ఏప్రిల్ 30న – పంజాబ్ కింగ్స్‌తో – చెన్నైలో – రాత్రి 7.30 గంట‌ల‌కు
మే 3న – రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుతో – బెంగ‌ళూరులో- రాత్రి 7.30 గంట‌ల‌కు
మే 7న – కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో – కోల్‌క‌తాలో- రాత్రి 7.30 గంట‌ల‌కు
మే 12న – రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌తో – చెన్నైలో – రాత్రి 7.30 గంట‌ల‌కు
మే 14న – గుజ‌రాత్ టైటాన్స్‌తో – అహ్మ‌దాబాద్‌లో -మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు