మళ్లీ ప్రేమలో పడ్డ శిఖర్ ధావన్.. ‘మై లవ్’ అంటూ ఆమె ఫొటో పోస్ట్‌.. ఇన్నాళ్లు అందరూ అనుకున్నదంతా నిజమే..

శిఖర్‌ ధావన్ గతంలో భార్యకు విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే.

టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ ఓ అమ్మాయితో లవ్‌లో ఉన్నాడని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు శిఖర్ ధావన్ ఆ వదంతులను నిజం చేస్తూ తన ప్రియురాలి ఫొటోను పోస్ట్‌ చేశాడు. తన ప్రియురాలు సోఫీ షైన్‌తో దిగిన ఫొటో ఇది. ‘మై లవ్’ అని ఆయన పేర్కొన్నాడు. ఈ పోస్టుకు సోఫీతో పాటు క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ లైక్ కొట్టారు. త్వరలోనే శిఖర్ ధావన్, సోఫీ పెళ్లి చేసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

సోఫీ లింక్డ్ఇన్ ప్రొఫైల్లో పేర్కొన్న వివరాల ప్రకారం.. ఆమె ఐరిష్ ప్రొడక్ట్ కన్సల్టెంట్. అమెరికన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ నార్తర్న్ ట్రస్ట్ కార్పొరేషన్‌లో వైస్ ప్రెసిడెంట్‌గానూ పనిచేస్తోంది. ధావన్, సోఫీ మధ్య యూఏఈలో పరిచయం ఏర్పడి, స్నేహం పెరిగి, వారిద్దరి మధ్య ప్రేమ చిగురించినట్లు తెలుస్తోంది. కొన్ని వారాలుగా వారు డేటింగ్ చేస్తున్నారు.

శిఖర్‌ ధావన్ గతంలో భార్యకు విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇండియన్-ఆస్ట్రేలియన్, మాజీ కిక్‌బాక్సర్, ఎంట్రప్రెన్యూర్ అయేషా ముఖర్జీ, శిఖర్‌ ధావన్ 2021లో విడిపోయారు. 2023 అక్టోబరు 5న వారికి విడాకులు మంజూరయ్యాయి. ధావన్ 2024 ఆగస్టులో క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. అప్పటి నుంచి కొన్ని లీగ్‌లలో వ్యాఖ్యాతగా కనపడుతున్నాడు.