Shoaib Bashir makes bizarre drs request after ravindra jadeja wrecks his stump
Shoaib Bashir drs : ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను భారత్ గెలుచుకుంది. ధర్మశాల వేదికగా జరిగిన ఆఖరి ఐదో టెస్టు మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా 4-1తో సిరీస్‌ను టీమ్ఇండియా సొంతం చేసుకుంది. కాగా.. ధర్మశాలలో మూడో రోజు ఆట సందర్భంగా ఓ సరదా ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది
అసలేం జరిగిందంటే?
259 పరుగులతో రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఇంగ్లాండ్‌కు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. టీమ్ఇండియా బ్యాటర్ల దాటికి ఇంగ్లీష్ బ్యాటర్లు పెవిలియన్‌కు వరుసగా క్యూ కట్టారు. అయితే.. జోరూట్ (84) ఒక్కడే ఓ వైపు ఒంటరి పోరాటం చేశాడు. అతడికి యువ ఆటగాడు, స్పిన్నర్ షోయబ్ బషీర్ (13) కాసేపు అండగా నిలిచాడు. కాగా.. ఇన్నింగ్స్ 46వ ఓవర్‌ను రవీంద్ర జడేజా వేశాడు.
ఈ ఓవర్‌లోని ఐదో బంతిని షోయబ్ డిఫెన్స్ ఆడాడు. అయితే.. బంతి అతడి బ్యాట్‌ను తగలకుండా ఆఫ్ స్టంప్‌ను గిరాటేసింది. అంపైర్ ఔట్ ఇవ్వడంతో భారత ఆటగాళ్లు ఆనందంలో మునిగిపోయారు. అయితే.. తాను బౌల్డ్ అయ్యాననే విషయం బషీర్ కు అర్ధం కాలేదు. స్టంపౌట్ అయ్యానని భావించాడు. అంపైర్ వేలు పైకి ఎత్తగానే వెంటనే రివ్యూ కావాలని సిగ్నల్ ఇచ్చాడు. దీన్ని చూసిన నాన్‌స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న జోరూట్ ఒక్కసారి నవ్వుకున్నాడు. నువ్వు బౌల్డ్ అయ్యావని బషీర్‌కు చెప్పాడు. దీన్ని చూసిన అంపైర్‌తో పాటు భారత ఆటగాళ్లు, మైదానంలో ప్రేక్షకులు నవ్వుకున్నారు.
Bashir asking for DRS after getting bowled
Things i will do when stressed— Nonsense (@jxttkxng) March 9, 2024
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. పాపం ఎవరన్నా చెప్పండ్రా.. బౌల్డ్ కు డిఆర్ఎస్ తీసుకోరు అని ఒకరు, పోనిలే అన్నా.. ఏదో చిన్నోడు తెలియక చేశాడు ఈసారి వదిలేయ్ అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.
మ్యాచ్ స్కోరు వివరాలు..
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్..218 ఆలౌట్
భారత మొదటి ఇన్నింగ్స్ .. 477 (ఓవరాల్‌గా 259 పరుగుల ఆధిక్యం)
ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్.. 195
ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో భారత్ గెలుపు
BCCI : భారత టెస్టు క్రికెటర్ల పంట పండింది.. ఒక్కొ మ్యాచ్‌కు రూ.45 లక్షల వరకు
— Grahman (@Grahman326048) March 9, 2024