2019ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీకి షరపోవా దూరం కానుంది. టెన్నిస్ అభిమానులకు మింగుడుపడని విషయాన్ని షరపోవా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా పోస్టు చేసింది. తప్పని పరిస్థితుల్లో ప్రతిష్టాత్మక ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీ నుంచి మాజీ ఫ్రెంచ్ ఛాంపియన్, రష్యా టెన్నిస్ స్టార్ మారియా షరపోవా వైదొలగాల్సి వచ్చింది. ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ మే 26వ తేదీ నుంచి జూన్ 9 వరకు జరగనుంది.
టోర్నీకి అందుబాటులో ఉండాలని 2019 ఫిబ్రవరిలో భుజానికి శస్త్ర చికిత్స చేయించుకుంది. టోర్నీ దగ్గర పడుతున్నా ఆమె పూర్తిగా కోలుకోపోవడం కలవరపెట్టింది. దీంతో ఆమె తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా పోస్టు చేసింది. ‘ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీ నుంచి తప్పుకుంటున్నాను. సరైన నిర్ణయాలు తీసుకోవడం కొన్ని సందర్భాల్లో అంత సులభం కాదు’ అని షరపోవా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేసింది.
ఈ టెన్నిస్ స్టార్ ప్లేయర్ కెరీర్‌లో మొత్తం 5 గ్రాండ్ స్లామ్ టైటిల్స్‌ను ఖాతాలో వేసుకున్న షరపోవా 2012, 14 సీజన్లలో 2సార్లు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్‌ను దక్కించుకుంది. గతేడాది జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీలో షరపోవా క్వార్టర్ ఫైనల్స్‌లో ముగురుజా చేతిలో 6-2, 6-1 తేడాతో ఓటమికి గురైంది.