Shreyas Iyer : ఆస్ట్రేలియా-ఏతో సిరీస్‌.. కెప్టెన్‌గా శ్రేయస్‌ అయ్యర్‌, వైస్ కెప్టెన్‌గా ధ్రువ్ జురెల్‌..

ఆస్ట్రేలియా-ఏతో జ‌ర‌గ‌నున్న సిరీస్‌ల కోసం భార‌త్‌-ఏ జ‌ట్టు కెప్టెన్‌గా శ్రేయ‌స్ అయ్య‌ర్ (Shreyas Iyer) ఎంపిక అయ్యాడు.

Shreyas Iyer announced as India As captain for multi day matches against Australia A

Shreyas Iyer : ఆసియాక‌ప్ 2025 కోసం ఎంపిక చేసిన భార‌త జ‌ట్టులో శ్రేయ‌స్ అయ్య‌ర్‌కు చోటు ద‌క్క‌లేదు. అయితే.. ఈ మిడిల్ ఆర్డ‌ర్ బ్యాట‌ర్‌కు ఓ బంప‌ర్ ఆఫ‌ర్ త‌గిలింది. త్వ‌ర‌లోనే ఆస్ట్రేలియా-ఏ జ‌ట్టు భార‌త్‌లో ప‌ర్య‌టించ‌బోతుంది. ఈ సిరీస్‌లో భారత-ఏ జట్టు ఆస్ట్రేలియా-ఏ జట్టుతో రెండు నాలుగు రోజుల అనధికారిక టెస్ట్‌ మ్యాచ్‌లు, ఆతర్వాత మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ ఆడనుంది. ఈ సిరీస్‌ల‌కు భార‌త్‌-ఏ కెప్టెన్‌గా శ్రేయ‌స్ అయ్య‌ర్ (Shreyas Iyer)ఎంపిక అయ్యాడు.

ధ్రువ్ జురెల్ వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. అభిమన్యు ఈశ్వరన్, ఎన్ జగదీసన్, సాయి సుదర్శన్ వంటి ఆట‌గాళ్లు జ‌ట్టులో చోటు ద‌క్కించుకున్నారు.

Rohit Sharma : అభిమానుల పై రోహిత్ శ‌ర్మ అస‌హ‌నం.. వినాయ‌కుడి ముందు.. నా పేరు ఎందుకు?

సెప్టెంబర్ 16 నుంచి తొలి అన‌ధికార టెస్టు ప్రారంభం కానుండ‌గా, సెప్టెంబ‌ర్ 23 నుంచి రెండో అన‌ధికార టెస్టు మ్యాచ్ ఆరంభం కానుంది. ఇక వ‌న్డే సిరీస్ సెప్టెంబ‌ర్ 30 నుంచి ప్రారంభం కానుంది.

రెండో అన‌ధికార టెస్టుకు కేఎల్ రాహుల్‌, సిరాజ్‌..

రెండో అన‌ధికార టెస్టు మ్యాచ్‌కు టీమ్ఇండియా సీనియ‌ర్ ఆట‌గాడు కేఎల్ రాహుల్, మ‌హ్మ‌ద్ సిరాజ్‌లు జ‌ట్టులో చేర‌నున్న‌ట్లు బీసీసీఐ వెల్ల‌డించింది.

ఆస్ట్రేలియా ఏతో మల్టీ-డే మ్యాచ్‌ల కోసం భారత ఏ జట్టు…

శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్‌), అభిమన్యు ఈశ్వరన్, ఎన్ జగదీశన్ (వికెట్ కీప‌ర్‌), సాయి సుదర్శన్, ధ్రువ్ జురెల్ (వైస్ కెప్టెన్‌), దేవదత్ పడిక్కల్, హర్ష్ దూబే, ఆయుష్ బడోని, నితీష్ రెడ్డి, ప్రస్న్‌దుష్ క్రిష్ణమేద్, గుర్నేల్ బి క్రిష్ణమేద్, గుర్నీదుష్ కోటియాన్ , మానవ్ సుతార్, యష్ ఠాకూర్

Team India Jersey : డ్రీమ్ 11 ఎగ్జిట్ త‌రువాత‌.. భార‌త జ‌ట్టు జ‌ర్సీ చూశారా..? ఫోటోలు వైర‌ల్‌