shubman gill
Shubman Gill: ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ తొలి వన్డేలో ఇండియా విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా భారీ స్కోర్ (349) పరుగులు సాధించింది. బ్యాటర్ శుభ్‌మన్ గిల్ అద్భుత ప్రతిభను కనబర్చాడు. 23ఏళ్ల వయస్సు కలిగిన గిల్ డబుల్ సెంచరీ చేశాడు. 208 పరుగులు చేసి ఐసీసీ ఎలైట్ గ్రూపులో 9వ స్థానంలో నిలిచాడు. ఐసీసీ అధికారిక ఖాతా ద్వారా ఈమేరకు ట్వీట్ చేసింది. పది మంది డబుల్ సెంచరీ చేసిన బ్యాటర్లను ఇందులో చేర్చింది. మొదటి స్థానంలో రోహిత్ శర్మ (264)తో ఉన్నాడు.
Shubman Gill: డబుల్ సెంచరీతో చెలరేగిన శుభ్‌మన్ గిల్.. న్యూజిలాండ్‌పై భారత్ భారీ స్కోరు
ఐసీసీ ట్వీట్ చేసిన ఎలైట్ జాబితాలో పది మందిలో ఐదుగురు ఇండియా బ్యాటర్లే ఉన్నారు. రోహిత్ శర్మ ఒక్కడే మూడు సార్లు డబుల్ సెంచరీలతో చెలరేగాడు. ఇండియా నుంచి ఎలైట్ గ్రూపులో రోహిత్ శర్మ(264, 209, 208), వీరేందర్ సెహ్వాగ్ (219), ఇషాన్ కిషన్ (210), శుభమన్ గిల్ (208), సచిన్ టెండుల్కర్ (200) ఉన్నారు. ఇతరదేశాల క్రికెటర్లలో కేవలం ముగ్గురే ఐసీసీ ఎలైట్ గ్రూపులో చోటు దక్కించుకున్నారు. వారిలో మార్టిన్ గుప్తిల్ (237), క్రిస్ గేల్ (215), ఫఖార్ జమాన్ ( 210) ఉన్నారు.
Shubman Gill joins an elite group of players ?
More records ➡️ https://t.co/d4ufih37VC pic.twitter.com/KSeJtd1IxE
— ICC (@ICC) January 19, 2023
గిల్ ఇప్పటి వరకు వన్డేల్లో మూడు, టెస్టుల్లో ఒక సెంచరీ చేశాడు. ఒకటి డబుల్ సెంచరీ ఉంది. వన్డే ఫార్మాట్ చరిత్రలో పాక్ బ్యాటర్ ఫఖర్ జమాన్ ఒక్కడే 18 మ్యాచ్‌లలో వెయ్యి రన్స్ స్కోర్ చేశాడు. ఆ తరువాతి స్థానంలో గిల్ నిలిచాడు. వన్డే కెరీర్ లో గిల్ కేవలం 19 మ్యాచ్ లలో వెయ్యి పరుగుల మైలు రాయిని దాటాడు.