Shubman Gill: డబుల్ సెంచరీతో చెలరేగిన శుభ్‌మన్ గిల్.. న్యూజిలాండ్‌పై భారత్ భారీ స్కోరు

ఆరంభం నుంచి ధాటిగా ఆడిన శుభ్‌మన్ గిల్ 145 బంతుల్లోనే డబుల్ సెంచరీ సాధించడం విశేషం. ఇది అతడికి వన్డేల్లో తొలి డబుల్ సెంచరీ. శుభ్‌మన్ గిల్ అద్భుత ఇన్నింగ్స్‌తో ఈ మ్యాచ్‌లో భారత్ భారీ స్కోరు సాధించింది. 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి, 349 పరుగులు చేసింది. న్యూజిలాండ్‌కు 350 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.

Shubman Gill: డబుల్ సెంచరీతో చెలరేగిన శుభ్‌మన్ గిల్.. న్యూజిలాండ్‌పై భారత్ భారీ స్కోరు

Shubman Gill: ఇండియా-న్యూజిలాండ్ జట్ల మధ్య, హైదరాబాద్, ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న తొలి వన్డేలో యువ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్ డబుల్ సెంచరీ సాధించాడు. ఆరంభం నుంచి ధాటిగా ఆడిన శుభ్‌మన్ గిల్ 145 బంతుల్లోనే డబుల్ సెంచరీ సాధించడం విశేషం. ఇది అతడికి వన్డేల్లో తొలి డబుల్ సెంచరీ. శుభ్‌మన్ గిల్ అద్భుత ఇన్నింగ్స్‌తో ఈ మ్యాచ్‌లో భారత్ భారీ స్కోరు సాధించింది.

Bengaluru: గొంతు కోసి డిగ్రీ విద్యార్థిని హత్య.. కాలేజీ నుంచి ఇంటికి వెళ్తుండగా దాడి చేసిన యువకులు

50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి, 349 పరుగులు చేసింది. న్యూజిలాండ్‌కు 350 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు ఆరంభం నుంచి నిలకడగా ఆడింది. శుభ్‌మన్ గిల్‌తో కలిసి రోహిత్ శర్మ ఇన్నింగ్స్ ఆరంభించారు. రోహిత్ నెమ్మదిగా ఆడుతూ 38 బంతుల్లో 34 పరుగులు చేసి ఔటయ్యాడు. తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ 10 బంతుల్లో 8 పరుగులే చేసి ఔటయ్యాడు. తర్వాత ఇషాన్ కిషన్ 14 బంతుల్లో 5 పరుగులు చేసి ఔట్ కాగా, సూర్య కుమార్ యాదవ్ 26 బంతుల్లో 31 పరుగులు చేసి వెనుదిరిగాడు. హార్ధిక్ పాండ్యా 38 బంతుల్లో 28 పరుగులు, వాషింగ్టన్ సుందర్ 14 బంతుల్లో 12 పరుగులు, శార్దూల్ ఠాకూర్ 3 బంతుల్లో 3 పరుగులు చేసి ఔటయ్యారు.

Manchu Manoj: జీవితంలో కొత్త దశలోకి అడుగుపెడుతున్నా.. మంచు మనోజ్ ఆసక్తికర ట్వీట్

అయితే, ఒకవైపు వికెట్లు పడుతున్నా ఏమాత్రం కంగారు పడకుండా శుభ్‌మన్ గిల్‌ మాత్రం దూకుడుగానే ఆడాడు. ఫోర్లు, సిక్సర్లతో కివీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ప్రత్యర్థి బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా బ్యాటింగ్ కొనసాగించాడు. 87 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సెంచరీ పూర్తైన తర్వాత మరింత దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులెత్తించాడు. 145 బంతుల్లోనే డబుల్ సెంచరీ సాధించాడు. శుభ్‌మన్ గిల్‌ వరుసగా మూడు సిక్సర్లు కొట్టి, డబుల్ సెంచరీ సాధించడం విశేషం. ఆ తర్వాత మరో నాలుగు బంతులు ఎదుర్కొన్న శుభ్‌మన్ గిల్‌ మొత్తం 149 బంతుల్లో, 208 పరుగులు చేసి ఔటయ్యాడు. శుభ్‌మన్ గిల్‌ ఇన్నింగ్స్‌లో 19 ఫోర్లు, 9 సిక్సర్లు ఉండటం విశేషం.

Transgenders: ట్రాన్స్‌జెండర్స్ గొప్ప మనసు.. రైలులో డబ్బులు అడుక్కునేందుకు వచ్చి గర్భిణికి ప్రసవం

వన్డేల్లో భారత్ తరఫున డబుల్ సెంచరీలు చేసిన ఐదో ఆటగాడిగా నిలిచాడు గిల్. భారత ఇన్నింగ్స్ ముగిసే సరికి కుల్దీప్ యాదవ్ 5 పరుగులతో, మొహ్మద్ షమీ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. దీంతో ఇండియా 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి, 349 పరుగులు చేసింది. న్యూజిలాండ్‌కు 350 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. కివీస్ బౌలర్లలో హెన్రీ షిప్లీ 2 వికెట్లు, డెరైల్ మిచెల్ 2 వికెట్లు తీయగా, ఫెర్గూసన్, టిక్నర్, శాంట్నర్ ఒక్కో వికెట్ తీశారు.