Transgenders: ట్రాన్స్‌జెండర్స్ గొప్ప మనసు.. రైలులో డబ్బులు అడుక్కునేందుకు వచ్చి గర్భిణికి ప్రసవం

ఒక గర్భిణి, తన భర్తతో కలిసి హౌరా-పాట్నా జన్‌శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలులో జముయ్ ప్రాంతానికి వెళ్తున్నారు. రైలు జసిదిహ్ రైల్వే స్టేషన్ దాటిన కొద్దిసేటికే గర్భిణికి పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి. నొప్పులు తీవ్రం కావడం, ఆమె పరిస్థితి విషమించడంతో ఆమె భర్త చాలా మంది మహిళల్ని సాయం అడిగాడు.

Transgenders: ట్రాన్స్‌జెండర్స్ గొప్ప మనసు.. రైలులో డబ్బులు అడుక్కునేందుకు వచ్చి గర్భిణికి ప్రసవం

Transgenders: ట్రాన్స్‌జెండర్స్ గొప్ప మనసు చాటుకున్నారు. రైళ్లో పురిటినొప్పులతో ఇబ్బంది పడుతున్న గర్భిణికి అందరూ కలిసి ప్రసవం చేశారు. ఈ ఘటన బిహార్ రాజధాని పాట్నా సమీపంలో, హౌరా-పాట్నా జన్‌శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలులో జరిగింది.

Bengaluru: గొంతు కోసి డిగ్రీ విద్యార్థిని హత్య.. కాలేజీ నుంచి ఇంటికి వెళ్తుండగా దాడి చేసిన యువకులు

ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒక గర్భిణి, తన భర్తతో కలిసి హౌరా-పాట్నా జన్‌శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలులో జముయ్ ప్రాంతానికి వెళ్తున్నారు. రైలు జసిదిహ్ రైల్వే స్టేషన్ దాటిన కొద్దిసేటికే గర్భిణికి పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి. నొప్పులు తీవ్రం కావడం, ఆమె పరిస్థితి విషమించడంతో ఆమె భర్త చాలా మంది మహిళల్ని సాయం అడిగాడు. తన భార్య ప్రసవానికి సాయం చేయాల్సిందిగా కోరాడు. అయితే, ఎవరూ ముందుకు రాలేదు. అయితే, అదే సమయంలో రైలులో డబ్బులు అడుక్కునేందుకు వచ్చిన ట్రాన్స్‌జెండర్స్ ఈ విషయం తెలుసుకున్నారు. అప్పటికే గర్భిణి పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే ప్రసవం చేయాల్సిన పరిస్థితి ఉంది.

Shubman Gill: సెంచరీ పూర్తి చేసుకున్న శుభ్‌మన్ గిల్.. నిలకడగా ఆడుతున్న భారత్

ఇది గుర్తించిన ట్రాన్స్‌జెండర్స్ అంతా కలిసి ఆమెకు సాయం చేయాలనుకున్నారు. ఆమెను రైలులోని వాష్ రూమ్‌కు తీసుకెళ్లి ప్రసవం చేశారు. అక్కడే ఆమె బిడ్డను ప్రసవించింది. తల్లి, బిడ్డా క్షేమంగా ఉన్నారు. తర్వాత బిడ్డను ఆశీర్వదించిన ట్రాన్స్‌జెండర్స్ తండ్రికి అప్పగించారు. అంతేకాదు.. ఆ దంపతులకు సాయం చేసేందుకు ఇతరుల దగ్గరి నుంచి డబ్బులు కూడా సేకరించారు. కాగా, ట్రాన్స్‌జెండర్స్ చేసిన సాయంపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.