Shubman Gill: సెంచరీ పూర్తి చేసుకున్న శుభ్‌మన్ గిల్.. నిలకడగా ఆడుతున్న భారత్

ఉప్పల్ స్టేడియం వేదికగా జరగుతున్న తొలి వన్డేలో యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 87 బంతుల్లోనే గిల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో శుభ్‌మన్ గిల్‌కు ఇది మూడో సెంచరీ. వరుసగా రెండో సెంచరీ.

Shubman Gill: సెంచరీ పూర్తి చేసుకున్న శుభ్‌మన్ గిల్.. నిలకడగా ఆడుతున్న భారత్

Shubman Gill: ఇండియా-న్యూజిలాండ్ జట్ల మధ్య, హైదరాబాద్, ఉప్పల్ స్టేడియం వేదికగా జరగుతున్న తొలి వన్డేలో యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 87 బంతుల్లోనే గిల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో శుభ్‌మన్ గిల్‌కు ఇది మూడో సెంచరీ. వరుసగా రెండో సెంచరీ.

Bengaluru: గొంతు కోసి డిగ్రీ విద్యార్థిని హత్య.. కాలేజీ నుంచి ఇంటికి వెళ్తుండగా దాడి చేసిన యువకులు

ఇటీవల శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో కూడా శుభ్‌మన్ గిల్ సెంచరీ (116 పరుగులు) సాధించిన సంగతి తెలిసిందే. మంచి ఫామ్‌లో ఉన్న గిల్ న్యూజిలాండ్ వన్డేలో కూడా తన దూకుడు కొనసాగిస్తున్నాడు. వరుసగా మంచి ఇన్నింగ్స్ ఆడుతూ, ఇండియాకు మంచి ఓపెనర్‌గా నిలుస్తున్నాడు. ఇక ఈ వన్డేలో భారత్ నిలకడగా బ్యాటింగ్ చేస్తోంది. తొలుత టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. రోహిత్ శర్మ, గిల్ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. రోహిత్ శర్మ 38 బంతుల్లో 34 పరుగులు చేసి ఔటయ్యాడు. తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ నిరాశ పరిచాడు. కోహ్లీ 10 బంతుల్లో 8 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. మరో యువ ఆటగాడు ఇషాన్ కిషన్ 14 బంతుల్లో 5 పరుగులే చేసి ఔటయ్యాడు.

Assembly Election: ఈశాన్య రాష్ట్రాల్లో మోగిన ఎన్నికల నగారా.. మూడు రాష్ట్రాల షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ

లేటెస్ట్ సెన్సేషన్ సూర్యకుమార్ యాదవ్ 26 బంతుల్లో 31 పరుగులు చేసి మిచెల్ బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో ఇండియా 175 పరుగులకే, 4 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో శుభ్‌మన్ గిల్ 110 పరుగులతో, హార్ధిక్ పాండ్యా 7 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇండియా స్కోరు 33 ఓవర్లలో 203-4గా ఉంది. న్యూజిలాండ్ బౌలర్లలో ఫెర్గూసన్, టిక్నర్, శాంట్నర్, మిచెల్.. తలో వికెట్ తీశారు.