×
Ad

IND vs NZ : తొలి వ‌న్డేలో న్యూజిలాండ్ పై విజ‌యం.. భార‌త కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ కామెంట్స్‌.. నా దృష్టి అంతా

తొలి వన్డేలో న్యూజిలాండ్ పై విజ‌యం సాధించిన త‌రువాత భార‌త కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ (Shubman Gill) కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు.

Shubman Gill Comments after India beat New Zealand in1st ODI (pic credit @@mufaddal_vohra)

  • తొలి వ‌న్డేలో న్యూజిలాండ్ పై విజ‌యం
  • మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి భార‌త్‌
  • ఆనందాన్ని వ్య‌క్తం చేసిన టీమ్ఇండియా కెప్టెన్ గిల్

IND vs NZ : మూడు మ్యాచ్‌ల వ‌న్డే సిరీస్‌లో భార‌త్ శుభారంభం చేసింది. వడోద‌ర వేదిక‌గా జ‌రిగిన తొలి వ‌న్డే మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. త‌ద్వారా సిరీస్‌లో టీమ్ఇండియా 1-0 ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది. కాగా.. ఈ మ్యాచ్‌లో విజ‌యం సాధించ‌డం పై భార‌త కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ ఆనందాన్ని వ్య‌క్తం చేశాడు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత‌ 50 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 300 పరుగులు చేసింది. కివీస్ బ్యాట‌ర్ల‌లో డారెల్‌ మిచెల్‌ (84; 71 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స‌ర్లు), హెన్రీ నికోల్స్‌ (62; 69 బంతుల్లో 8 ఫోర్లు), డెవాన్‌ కాన్వే (56; 67 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌) హాఫ్ సెంచ‌రీలు చేశారు. టీమ్ఇండియా బౌల‌ర్ల‌లో సిరాజ్‌, హ‌ర్షిత్ రాణా, ప్ర‌సిద్ధ్ కృష్ణ లు త‌లా రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు. కుల్దీప్ యాద‌వ్ ఓ వికెట్ సాధించాడు.

IND vs NZ : అందుకే మేం ఓడిపోయాం.. ఆ ఒక్క ప‌ని చేసుంటేనా.. కివీస్ కెప్టెన్ బ్రేస్‌వెల్ కామెంట్స్

ఆ త‌రువాత విరాట్ కోహ్లీ (93; 91 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్‌) అద్భుత ఇన్నింగ్స్‌ ఆడడంతో భారత్‌ లక్ష్యాన్ని 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి అందుకుంది. మిగిలిన బ్యాట‌ర్ల‌లో శుభ్‌మన్‌ గిల్‌ (56; 71 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), శ్రేయస్‌ అయ్యర్‌ (49; 47 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌) లు రాణించారు. కివీస్ బౌల‌ర్ల‌లో కైల్‌ జేమీసన్ నాలుగు వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఆదిత్య అశోక్, క్రిస్టియన్ క్లార్క్ లు చెరో వికెట్ తీశారు.

రొటేష‌న్‌లో భాగంగానే..

మ్యాచ్ అనంత‌రం భార‌త కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ మాట్లాడుతూ.. ఛేద‌న‌లో రాణించ‌డం ఎంతో ఆనందాన్ని ఇచ్చింద‌న్నాడు. త‌న దృష్టి అంతా ప్ర‌స్తుతం న్యూజిలాండ్‌తో వ‌న్డే సిరీస్ పైనే ఉంద‌న్నాడు. ‘ఓ క్రీడాకారుడిగా మీరు మీ ముందున్న దానిపై దృష్టి పెట్టాలి. ఆ క్షణంలో పరిస్థితి ఏమి డిమాండ్ చేస్తుందో దానిపై దృష్టి పెట్టాలి. అదే మిమ్మల్ని విజయాలను, నిరాశలను రెండింటినీ ఎదుర్కోవడానికి సాయ‌ప‌డుతుంది. నేను అదే చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నాను.’ గిల్ అని అన్నాడు.

Prithvi shaw : గ‌ర్ల్‌ఫ్రెండ్‌తో పృథ్వీ షా రొమాన్స్‌.. ఆ దేవుడు రాసిన స్ప్రిప్ట్ అంటూ వీడియో పోస్ట్..

ఇక కోహ్లీ ఇన్నింగ్స్ పై మాట్లాడుతూ.. అత‌డు చాలా బాగా ఆడుతున్నాడ‌ని తెలిపాడు. అత‌డు బంతిని కొడుతున్న తీరు చూస్తుంటే అంతా బాగుంద‌ని అనిపిస్తుందన్నాడు. ఇలాంటి పిచ్ ఆడ‌డం అంత తేలిక కాద‌న్నాడు. ఇక అర్ష్‌దీప్ సింగ్ ను తుది జ‌ట్టులోకి తీసుకోక‌పోవ‌డం పై స్పందిస్తూ గ‌త సిరీస్‌లో అత‌డు బాగా ఆడిన‌ప్ప‌టికి రొటేష‌న్‌లో భాగంగానే ఇలా చేయాల్సి వ‌చ్చింద‌న్నాడు. గ‌త సిరీస్‌లో సిరాజ్ భాగం కాద‌న్నాడు. ప్ర‌పంచ‌ప్ కోసం స‌న్న‌ద్ధం అవుతున్నామ‌ని, ఈ మెగాటోర్నీ స‌మ‌యానికి ఎక్కువ వ‌న్డేలు ఆడే అవ‌కాశం లేక‌పోవ‌డంతో అంద‌రికి అవ‌కాశాలు ఇవ్వ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని చెప్పుకొచ్చాడు.