Shubman Gill : మైదానంలో కామ్.. అయితేనేం.. సోష‌ల్ మీడియా వేదిక‌గా పాక్ ఆట‌గాళ్ల‌కు గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చిన శుభ్‌మ‌న్ గిల్‌..

పాక్‌తో మ్యాచ్ ముగిసిన త‌రువాత ఆ జ‌ట్టు ఆట‌గాళ్లకు సోష‌ల్ మీడియా వేదిక‌గా శుభ్‌మ‌న్‌ గిల్ (Shubman Gill ) సూప‌ర్ కౌంట‌ర్ ఇచ్చాడు.

Asia Cup 2025 Shubman Gill Gives Pakistan A Befitting Reply on social media

Shubman Gill : ఆసియాక‌ప్ 2025 సూప‌ర్‌-4లో భాగంగా దుబాయ్ వేదిక‌గా ఆదివారం పాక్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో భార‌త్ 6 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్‌లో గెలిచేందుకు పాక్ అన్ని ప్ర‌య‌త్నాల‌ను చేసింది. భార‌త ఆట‌గాళ్ల‌ను రెచ్చ‌గొట్టి ఔట్ చేయాల‌ని ప్ర‌ణాళిక‌ల‌ను ర‌చ్చింది. ఈ క్ర‌మంలోనే ధాటిగా ఆడుతున్న టీమ్ఇండియా ఓపెన‌ర్లు అభిషేక్ శ‌ర్మ‌, శుభ్‌మ‌న్ గిల్ ల ఏకాగ్ర‌త చెడ‌గొట్టేందుకు పాక్ పేస‌ర్ హ‌రిస్ రౌఫ్ రెచ్చ‌గొట్టేలా వ్యాఖ్య‌లు చేశాడు.

ఇందుకు అభిషేక్ శ‌ర్మ త‌గ్గేదే అంటూ మైదానంలోనే మాట‌కు మాట బ‌దులు ఇచ్చాడు. అటు హ‌రిస్‌, ఇటు అభిషేక్ శ‌ర్మ ఏ మాత్రం త‌గ్గ‌లేదు. ప‌రిస్థితి అదుపుత‌ప్పేలా ఉండ‌డంతో మైదానంలోని ఆన్ ఫీల్డ్ అంపైర్లు జోక్యం చేసుకుని ఇద్ద‌రిని దూరం తీసుకువెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

CPL 2025 : క‌రేబియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 2025 విజేత‌గా నైట్‌రైడ‌ర్స్‌.. ఏకంగా ఐదో సారి..

దీనిపై మైదానంలో సైలెంట్‌గానే ఉన్న టీమ్ఇండియా వైస్ కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ (Shubman Gill) మ్యాచ్ ముగిసిన త‌రువాత సోష‌ల్ మీడియా వేదిక‌గా పాక్ ఆట‌గాళ్లకు గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చాడు. మ్యాచ్‌కు సంబంధించిన ఫోటోల‌ను షేర్ చేస్తూ “ఆట మాట్లాడుతుంది.. మాట‌లు కాదు” అంటూ రాసుకొచ్చాడు. ప్ర‌స్తుతం గిల్ పోస్ట్ వైర‌ల్ అవుతోంది. దీనిపై నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు చేస్తూ పాక్ ఆట‌గాళ్ల‌పై మండిప‌డుతున్నారు.

ఈ మ్యాచ్‌లో పాక్ ఆట‌గాళ్లు మాట‌ల‌తో రెచ్చ‌గొట్టిన‌ప్ప‌టికి కూడా టీమ్ఇండియా ఓపెన‌ర్లు అభిషేక్ శ‌ర్మ (39 బంతుల్లో 74 పరుగులు), శుభ్‌మ‌న్ గిల్ (28 బంతుల్లో 47 ప‌రుగులు) త‌మ బ్యాట్‌తో గ‌ట్టి స‌మాధాన‌మే చెప్పారు. 172 ప‌రుగుల ల‌క్ష్య ఛేద‌న‌లో తొలి వికెట్ గిల్‌-అభిషేక్‌ల జోడి 105 ప‌రుగుల భారీ భాగ‌స్వామ్యాన్ని జోడించి టీమ్ఇండియా గెలుపుకు బాట‌లు వేసింది. మిగతా బ్యాట‌ర్లు రాణించ‌డంతో ల‌క్ష్యాన్ని 18.5 ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్లు కోల్పోయి అందుకుంది.

IND vs PAK : షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ.. పాక్‌తో మ్యాచ్ ముగిసిన వెంట‌నే.. టీమ్ఇండియా ఆట‌గాళ్ల‌ను కోరిన గంభీర్‌.. వీడియో వైర‌ల్‌

ఇప్ప‌టికే పాక్ ఆట‌గాళ్ల క‌వ్వింపుల‌పై మ్యాచ్ అనంత‌రం అభిషేక్ శ‌ర్మ స్పందించాడు. ఎలాంటి కార‌ణాలు లేకుండానే వాళ్లు క‌వ్వింపుల‌కు దిగడం త‌న‌కు ఏ మాత్రం న‌చ్చ‌లేద‌న్నాడు. అందుక‌నే వారికి బ్యాట్‌తో స‌మాధానం చెప్పాల‌ని భావించాన‌ని, ఈ క్ర‌మంలోనే వారిపై విరుచుకుప‌డ్డ‌ట్లు తెలిపాడు.