IND vs PAK : షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ.. పాక్‌తో మ్యాచ్ ముగిసిన వెంట‌నే.. టీమ్ఇండియా ఆట‌గాళ్ల‌ను కోరిన గంభీర్‌.. వీడియో వైర‌ల్‌

పాక్‌తో మ్యాచ్ (IND vs PAK) ముగిసిన త‌రువాత టీమ్ఇండియా హెడ్ కోచ్ గౌత‌మ్ గంభీర్ చేసిన ప‌నికి సంబంధించిన ఓ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

IND vs PAK : షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ.. పాక్‌తో మ్యాచ్ ముగిసిన వెంట‌నే.. టీమ్ఇండియా ఆట‌గాళ్ల‌ను కోరిన గంభీర్‌.. వీడియో వైర‌ల్‌

Asia Cup 2025 Gautam Gambhir Changes Handshake Protocol After Pakistan Match

Updated On : September 22, 2025 / 10:11 AM IST

IND vs PAK : ఆసియాక‌ప్ 2025లో భాగంగా గ్రూప్ స్టేజీలో సెప్టెంబ‌ర్ 14న భార‌త్, పాక్ జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. ఆ మ్యాచ్‌లో క‌ర‌చాల‌న వివాదం చోటు చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఆ మ్యాచ్ టాస్ స‌మ‌యంలో, మ్యాచ్ ముగిసిన త‌రువాత టీమ్ఇండియా కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్‌తో పాటు మిగిలిన భార‌త ఆట‌గాళ్లు పాక్ ప్లేయ‌ర్ల‌తో క‌ర‌చాల‌నం చేయ‌లేదు. ఆఖ‌రికి అధికారుల‌తో కూడా టీమ్ఇండియా ప్లేయ‌ర్లు క‌ర‌చాల‌నం చేయ‌లేదు.

ఇక నిన్న (ఆదివారం సెప్టెంబ‌ర్ 21న‌) సూప‌ర్‌-4లో భాగంగా దుబాయ్ వేదిక‌గా భార‌త్‌, పాక్ జ‌ట్లు (IND vs PAK) మ‌రోసారి త‌ల‌ప‌డ్డాయి. ఈ సారి కూడా టాస్ స‌మ‌యంలో పాక్ కెప్టెన్ స‌ల్మాన్ అలీ అఘాతో టీమ్ఇండియా టీ20 కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్ క‌ర‌చాల‌నం చేయ‌లేదు. అయితే.. మ్యాచ్ ముగిసిన త‌రువాత టీమ్ఇండియా హెడ్ కోచ్  గౌత‌మ్ గంభీర్ అభ్య‌ర్థ‌న మేర‌కు ప్రోటోకాల్‌లో స్వ‌ల్ప మార్పు చోటు చేసుకుంది.

Salman Ali Agha : అందుకే మేం ఓడిపోయాం.. లేదంటేనా.. భార‌త్ పై ఓట‌మి త‌రువాత పాక్ కెప్టెన్ కామెంట్స్‌..

సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న వీడియోలును బ‌ట్టి.. మ్యాచ్ అనంత‌రం టీమ్ఇండియా ఆట‌గాళ్లు డ్రెస్సింగ్ రూమ్‌లో ఉండ‌గా.. మైదానంలో ఉన్న హెడ్ కోచ్ గౌత‌మ్ గంభీర్‌.. ప్లేయ‌ర్ల‌ను బ‌య‌ట‌కు వ‌చ్చి అంపైర్ల‌తో క‌ర‌చాల‌నం చేయ‌మ‌ని కోరాడు. ఇక్క‌డ ష‌ర‌తు ఏంటంటే.. పాక్ ఆటగాళ్ల‌తో కాకుండా అంపైర్ల‌తో మాత్ర‌మే క‌ర‌చాల‌నం చేయాల‌ని సూచించాడు.

పాక్ ఇజ్జ‌త్ తీసిన సూర్య‌కుమార్ యాద‌వ్?.

మ్యాచ్ అనంత‌రం విలేక‌రుల స‌మావేశంలో సూర్య‌కుమార్ యాద‌వ్ మాట్లాడుతూ.. ఇన్‌డైరెక్టుగా పాక్ ఇజ్జ‌త్ తీశాడు. ఇక నుంచి ఆ జట్టును ప్ర‌త్య‌ర్థి అని పిల‌వ‌డం మానేయాల‌ని కోరాడు. ఓ రెండు జ‌ట్ల మ‌ధ్య 20 మ్యాచ్ జ‌రిగాయని అనుకుంటే.. అప్పుడు గ‌ణాంకాలు 10-10 లేదా 11-9 లేదా 12-8 ఉంటే వాటిని ప్ర‌త్య‌ర్థులు (స‌మఉజ్జీలు)అని అనొచ్చు. అంతేకానీ.. 13-0, 10-1 గ‌ణాంకాలు న‌మోదు అయితే వాటిని ప్ర‌త్య‌ర్థులు అని పిల‌వొద్దు అంటూ ఇన్‌డైరెక్టుగా పాక్ ఇజ్జత్ తీశాడు.

Abhishek Sharma : ‘నాకు అది అస్స‌లు న‌చ్చ‌లేదు.. అందుకే బ్యాట్‌తో చిత‌క్కొట్టుడు..’ పాక్‌తో మ్యాచ్ పై అభిషేక్ శ‌ర్మ కామెంట్స్‌..

భార‌త్‌, పాక్ జ‌ట్ల మ‌ధ్య గ‌త ఆరు మ్యాచ్‌లు తీసుకుంటే.. క‌నీసం ఒక్క మ్యాచ్‌లోనూ పాక్ గెల‌వ‌ని సంగ‌తి తెలిసిందే.