Shubman Gill 2500 ODI runs
టీమ్ ఇండియా యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ అరుదైన సాధించాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 2500 పరుగులు సాధించిన ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇంగ్లాండ్‌తో మూడో వన్డే మ్యాచ్‌లో 25 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద గిల్ ఈ ఘనత సాధించాడు. ఈ క్రమంలో అతడు దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు హషీమ్ ఆమ్లా రికార్డును బ్రేక్ చేశాడు. ఆమ్లా 51 వన్డే ఇన్నింగ్స్‌ల్లో 2500 పరుగులు సాధించగా గిల్ 50వ వన్డే ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మైలురాయిని చేరుకున్నాడు.
వన్డే క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా (ఇన్నింగ్స్‌ల పరంగా) 2500 పరుగులు చేసిన ఆటగాళ్లు..
శుభ్‌మన్ గిల్ (భారత్) – 50 ఇన్నింగ్స్‌ల్లో
హషీమ్ ఆమ్లా (దక్షిణాఫ్రికా) – 51 ఇన్నింగ్స్‌ల్లో
ఇమామ్ ఉల్ హక్ (పాకిస్థాన్) – 52 ఇన్నింగ్స్‌ల్లో
వివియన్ రిచర్డ్స్ (వెస్టిండీస్) – 56 ఇన్నింగ్స్‌ల్లో
జోనాథన్ ట్రాట్ (ఇంగ్లాండ్) – 56 ఇన్నింగ్స్‌ల్లో
🚨 HISTORY BY SHUBMAN GILL 🚨
– Gill is the fastest to complete 2500 runs in ODI History. pic.twitter.com/gzem7yiDFV
— Johns. (@CricCrazyJohns) February 12, 2025
2019లో వన్డేల్లో అరంగ్రేటం..
2019 జనవరి 31న న్యూజిలాండ్‌తో హామిల్టన్ వేదికగా జరిగిన మ్యాచ్ ద్వారా వన్డేల్లో అరంగ్రేటం చేశాడు గిల్. నేడు (2025 ఫిబ్రవరి 12) అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లాండ్‌తో మూడో వన్డే మ్యాచ్.. గిల్ కెరీర్‌లో 50వ వన్డే మ్యాచ్. తన కెరీర్ మైలుస్టోన్ లాంటి మ్యాచ్‌లో చెలరేగి ఆడుతున్నాడు. ఈ క్రమంలో 25 పరుగుల వ్యక్తి గత స్కోరు వద్ద వన్డేల్లో 2500 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు.
మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో అరుదైన రికార్డు..
ఈ మ్యాచ్‌లో గిల్ మరో ఘనతను సాధించాడు. 51 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ సిరీస్‌లో గిల్‌కు ఇది హ్యాట్రిక్ హాఫ్ సెంచరీ. ఈ క్రమంలో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో వరుసగా మూడు మ్యాచ్‌ల్లోనూ అర్థశతకాలు బాదిన అరుదైన జాబితాలో స్థానం సంపాదించుకున్నాడు. గిల్ కన్నా ముందు శ్రీకాంత్, దిలీప్ వెంగ్ సర్కార్, అజారుద్దీన్, ధోని, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌లు ఈ జాబితాలో ఉన్నారు.
IND vs ENG : మూడు మార్పులతో బరిలోకి దిగిన టీమ్ఇండియా.. నిరాశపరిచిన రోహిత్ శర్మ..
మూడు వన్డేల సిరీస్‌లో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో హాఫ్ సెంచరీలు చేసిన భారత ఆటగాళ్లు..
కృష్ణమాచారి శ్రీకాంత్ – 1982లో శ్రీలంక పై
దిలీప్ వెంగ్‌సర్కార్ – 1985లో శ్రీలంకపై
మహమ్మద్ అజారుద్దీన్ – 1993లో శ్రీలంక పై
ఎంఎస్ ధోని – 2019లో ఆస్ట్రేలియా పై
శ్రేయాస్ అయ్యర్ – 2020లో న్యూజిలాండ్ పై
ఇషాన్ కిషన్ – 2023లో వెస్టిండీస్ పై
శుభ్‌మన్ గిల్ – 2025లో ఇంగ్లాండ్ పై