IND vs ENG : మూడు మార్పులతో బరిలోకి దిగిన టీమ్ఇండియా.. నిరాశపరిచిన రోహిత్ శర్మ..
అహ్మదాబాద్ వన్డే మ్యాచ్‌లో టీమ్ఇండియా మూడు మార్పులతో బరిలోకి దిగింది.

IND vs ENG 3rd ODI England Win the toss team india first batting
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య అహ్మదాబాద్ వేదికగా మూడో వన్డే మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ మొదట బ్యాటింగ్ చేస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇరు జట్లు ఆడుతున్న చివరి వన్డే మ్యాచ్ ఇదే. ఈ మ్యాచ్‌లో గెలిచి ఆత్మవిశ్వాసంతో ఛాంపియన్స్ ట్రోఫీలో అడుగుపెట్టాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. ఇక ఈ మ్యాచ్‌లో భారత జట్టు మూడు మార్పులతో బరిలోకి దిగింది.
ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తిలకి విశ్రాంతి ఇచ్చింది. వీరి స్థానాల్లో వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్‌లు జట్టులోకి ఎంట్రీ ఇచ్చారు. అటు ఇంగ్లాండ్ జట్టు ఓ మార్పుతో బరిలోకి దిగింది. జామీ ఓవర్టన్ స్థానంలో టామ్ బాంటన్ ను తీసుకుంది.
Virat Kohli : ఇంగ్లాండ్‌తో మూడో వన్డే.. ఆల్‌టైమ్ రికార్డు పై కోహ్లీ కన్ను..
టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫామ్‌లేమీతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ మ్యాచ్‌తోనైనా అతడు ఫామ్ అందుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.
England have won the toss and elect to bowl first in the 3rd and final ODI of the series.
Live – https://t.co/S88KfhFzri… #INDvENG@IDFCFIRSTBank pic.twitter.com/TrVAf1FUAT
— BCCI (@BCCI) February 12, 2025
నిరాశపరిచిన రోహిత్ శర్మ..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు గట్టి షాక్ తగిలింది. రెండో వన్డే మ్యాచ్‌లో శతక్కొట్టి ఫామ్‌లోకి వచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మ విఫలం అయ్యాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 13 పరుగులు చేస్తే వన్డేల్లో 11 వేల పరుగుల మైలురాయిని అందుకునే అవకాశం ఉంది. దీంతో అతడు ఈజీగా ఈ మైలురాయిని చేరుకుంటాడని అంతా భావించారు. అయితే.. రోహిత్ మాత్రం కేవలం 2 బంతులు ఎదుర్కొని ఒక్క పరుగు మాత్రమే చేసి నిరాశపరిచాడు. మార్క్‌వుడ్ బౌలింగ్‌లో ఫిలిప్ సాల్ట్ క్యాచ్ అందుకోవడంతో పెవిలియన్‌కు చేరుకున్నాడు.
భారత తుది జట్టు..
రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్.
ఇంగ్లాండ్ తుది జట్టు..
ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), బెన్ డకెట్, జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(కెప్టెన్), టామ్ బాంటన్, లియామ్ లివింగ్‌స్టోన్, గస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, సకిబ్ మహమూద్.