Virat Kohli : ఇంగ్లాండ్‌తో మూడో వన్డే.. ఆల్‌టైమ్ రికార్డు పై కోహ్లీ కన్ను..
టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ వన్డేల్లో ఓ ఆల్‌టైమ్ రికార్డు పై కన్నేశాడు.

IND vs ENG 3rd ODI Virat Kohli eye on big milestone
మరో మ్యాచ్ మిగిలి ఉండగానే వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది భారత్. ఇప్పుడు సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని ఆరాటపడుతోంది. ఈ క్రమంలో అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరగనున్న మూడో వన్డేలో విజయం సాధించేందుకు ప్రణాళికలను రచిస్తోంది. మరోవైపు భారత స్టార్ విరాట్ కోహ్లీ ఫామ్ అందుకోవాలని టీమ్‌మేనేజ్‌మెంట్ తో పాటు అభిమానులు కోరుకుంటున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్ ఆడనున్న చివరి వన్డే మ్యాచ్ ఇదే కావడంతో ప్రస్తుతం అందరి దృష్టి ఈ మ్యాచ్‌పైనే ఉంది.
గతకొంతకాలంగా కోహ్లీ పేలవ ఫామ్‌లో సతమతమవుతున్నాడు. తనకు అచ్చొచ్చిన వన్డేల్లో సత్తా చాటాలని భావిస్తున్నాడు. మోకాలి నొప్పితో నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలి వన్డే దూరం అయిన కోహ్లీ.. కటక్ వేదికగా జరిగిన రెండో వన్డేలో బరిలోకి దిగాడు. అయితే.. ఈ మ్యాచ్‌లో 8 బంతులు ఆడి 5 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. దీంతో చివరిదైన మూడో వన్డేలో శతకంతో చెలరేగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
IPL 2025 : గుజరాత్ టైటాన్స్‌కు కొత్త యజమాని?
అరుదైన రికార్డు పై కోహ్లీ కన్ను..
ఇంగ్లాండ్‌తో మూడో వన్డే నేపథ్యంలో కోహ్లీని ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. వన్డేల్లో ఇప్పటి వరకు కోహ్లీ 296 మ్యాచ్‌లు ఆడాడు. 284 ఇన్నింగ్స్‌ల్లో 58 సగటుతో 13, 911 పరుగులు చేశాడు. ఇందులో 50 శతకాలు 72 అర్థశతకాలు ఉన్నాయి. ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో 89 పరుగులు చేస్తే వన్డేల్లో 4 వేల పరుగుల మైలురాయిని చేరుకుంటాడు. ఈ క్రమంలో వన్డేల్లో అత్యంత వేగంగా 14వేల పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా చరిత్ర సృష్టించనున్నాడు.
ఇప్పటి వరకు ఈ రికార్డు టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. సచిన్ 350 ఇన్నింగ్స్‌ల్లో 14 వేలు పరుగులు చేశాడు. ఇప్పటి వరకు వన్డేల్లో ఇద్దరు ఆటగాళ్లు మాత్రమే 14 వేలకు పైగా పరుగులు చేశారు. ఒకరు సచిన్ కాగా మరొకరు శ్రీలంక దిగ్గజ ఆటగాడు కుమార సంగక్కర.
IND vs ENG : భారత్, ఇంగ్లాండ్ మూడో వన్డే.. పిచ్ రిపోర్టు, స్టేడియం రికార్డ్స్, ఇంకా..
వన్డేల్లో 14వేలకు పైగా పరుగులు చేసిన ఆటగాళ్లు..
సచిన్ టెండూల్కర్ (భారత్) – 18,426 పరుగులు
కుమార సంగక్కర (శ్రీలంక) – 14, 234 పరుగులు