IPL 2025 : గుజరాత్ టైటాన్స్‌కు కొత్త యజమాని?
గుజరాత్ టైటాన్స్ మెజారిటీ వాటాను భారతీయ వ్యాపార సంస్థ టోరెంటో గ్రూప్ కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది.

IPL 20IPL 2025 Ahmedabad based conglomerate to buy majority stake in Gujarat Titans25 Ahmedabad based conglomerate to buy majority stake in Gujarat Titans
ఐపీఎల్ ప్రాంఛైజీల్లో గుజరాత్ టైటాన్స్ ఒకటి. 2021లో సీవీసీ క్యాపిటల్ పార్ట్నర్స్ (ఇరేలియా కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్) గుజరాత్ టైటాన్స్‌ను కొనుగోలు చేసింది. 2022 సీజన్‌లో ఈ జట్టు ఐపీఎల్‌లో ఎంట్రీ ఇచ్చింది. అయితే.. తాజాగా సీవీసీ క్యాపిటల్ పార్ట్నర్స్ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. దాదాపు 67 శాతాన్ని విక్రయించేందుకు సిద్ధంకాగా.. ఈ వాటాను భారత వ్యాపార సంస్థ టోరెంటో కొనుగోలు చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
టోరెంట్ గ్రూప్.. జీటీ ఫ్రాంచైజీలో మెజారిటీ వాటాను కొనుగోలు చేయనున్నందున వారు కొత్త యజమానులుగా మారనున్నారు. అయితే.. ఎంత ధరకు ఒప్పందం జరిగిందన్న విషయాలు తెలియరాలేదు. ఈ ఒప్పందం ఐపీఎల్ పాలక మండలి నుండి తుది ఆమోదం కోసం వేచి ఉందని క్రిక్ ఇన్ఫో తెలిపింది.
IND vs ENG : భారత్, ఇంగ్లాండ్ మూడో వన్డే.. పిచ్ రిపోర్టు, స్టేడియం రికార్డ్స్, ఇంకా..
ఐపీఎల్ కొత్త జట్ల విక్రయాలకు సంబంధించిన లాక్ ఇన్ పీరియడ్‌ని బీసీసీఐ విధించింది. ఫిబ్రవరి 2025తో ఇది ముగుస్తుంది. ఆ తరువాత ఫ్రాంఛైజలు వాటాలను విక్రయించడానికి అనుమతి లభిస్తుంది. దీంతో ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందే ఈ డీల్ పూర్తి చేయాలని టొరంటో భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
లీగ్‌లో ఎంట్రీ తొలి సీజన్‌లోనే (2022) గుజరాత్ విజేతగా నిలిచింది. హార్దిక్ నాయకత్వంలో టైటిల్‌ను అందుకుంది. ఆ తరువాతి సీజన్‌లో ఫైనల్‌కి చేరుకుంది. అయితే.. ఐపీఎల్ 2024 సీజన్ లో నిరాశపరిచింది. ఎనిమిదో స్థానానికి పరిమితమైంది. ఇక ఐపీఎల్ 2025 మెగా వేలంలో కీలక ఆటగాళ్లకు సొంతం చేసుకుంది. టీమ్ఇండియా యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ ప్రస్తుతం గుజరాత్ నాయకత్వ వహిస్తున్నాడు.
ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్ జట్టు ఇదే..
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రషీద్ ఖాన్, సాయి సుదర్శన్, రాహుల్ తేవాటియా, షారుఖ్ ఖాన్, కగిసో రబాడ, జోస్ బట్లర్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, నిశాంత్ సింధు, మహిపాల్ లొమ్రోర్, కుమార్ కుషాగ్రా, అనుజ్ రావత్, సుందర్ మానవ్. జెరాల్డ్ కోయెట్జీ, అర్షద్ ఖాన్, గుర్నూర్ బ్రార్, షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, సాయి యవద్ శర్మ, జయంత్ శర్మ, ఇషాంత్, గ్లెన్ ఫిలిప్స్, కరీం జనత్, కుల్వంత్ ఖేజ్రోలియా.