Virat Kohli : కోహ్లీ హగ్ అందుకున్న ఆ లక్కీ లేడీ ఎవరు? అంత మంది ఉంటే ఆమెతోనే కోహ్లీ ఎందుకు మాట్లాడాడు?
టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Virat Kohli hugs woman at airport and Internet Abuzz Over Woman Identity
పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మనదేశంలోనే కాదు విదేశాల్లోనూ కోహ్లీకి వీరాభిమానులు ఉన్నారు. కోహ్లీని కలవాలని, కనీసం ఒక్కసారి అతడితో మాట్లాడాలని, షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు పోటీపడుతుంటారు. అయితే.. కోహ్లీ ఓ మహిళా అభిమానికి స్వయంగా హాగ్ ఇచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
ఇంగ్లాండ్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను భారత్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే గెలుచుకుంది. ఇక నామమాత్రమైన మూడో వన్డే బుధవారం అహ్మదాబాద్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ కోసం భారత జట్టు కటక్ నుంచి అహ్మదాబాద్ బయలుదేరింది.
టీమ్ ఇండియా భువనేశ్వర్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న సమయంలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఎయిర్ పోర్టులో చెకింగ్ ఎరియాకు ముందు అభిమానులు కొందరు క్రికెటర్లను చూసేందుకు నిలబడ్డారు.
That Hug 🥺❤️ pic.twitter.com/nSkwhmtZUs
— Virat Kohli Fan Club (@Trend_VKohli) February 10, 2025
టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ అటుగా వెలుతూ.. ఆ గుంపులో ఉన్న ఓ లేడీ ఫ్యాన్స్‌ను చూసి నవ్వి.. ఆమె వద్దకు వెళ్లి హగ్ ఇచ్చి మాట్లాడాడు. మిగిలిన వారు కోహ్లీకి షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ప్రయత్నించగా భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. కోహ్లీ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ వీడియో వైరల్‌గా మారింది. కోహ్లీ హగ్ ఇచ్చిన ఆ అదృష్ట మహిళ ఎవరు? ఆమెనే కోహ్లీ ఎందుకు కౌగిలించుకున్నాడు ? అని ఫ్యాన్స్ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. కాగా.. ఆ మహిళ కోహ్లీ దగ్గరి బంధువుగా కొందరు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే.. విరాట్ కోహ్లీ గత కొంతకాలంగా పేలవ ఫామ్‌తో సతమతమవుతున్నాడు. మోకాలి నొప్పితో తొలి వన్డేకు అతడు దూరంగా అయ్యాడు. రెండో వన్డేలో బరిలోకి దిగి.. 8 బంతులు ఎదుర్కొని కేవలం 5 పరుగులకే పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఇక ఆఖరి వన్డేలోనైనా కోహ్లీ ఫామ్ అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రెండో వన్డేలో శతకంతో రోహిత్ ఫామ్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇక కోహ్లీ సైతం ఫామ్ అందుకుంటే ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఎదురుండదని అంటున్నారు.