IND vs ENG : ఇంగ్లాండ్‌తో మూడో వ‌న్డే.. అరుదైన మైలురాయిపై రోహిత్ క‌న్ను.. స‌చిన్‌, గంగూలీ, పాంటింగ్, సంగ‌క్క‌ర‌ల రికార్డుల‌ను బ్రేక్ చేసే గోల్డెన్ ఛాన్స్‌

అహ్మదాబాద్ వేదిక‌గా ఇంగ్లాండ్‌తో జ‌ర‌గ‌నున్న మూడో వ‌న్డే మ్యాచ్‌లో రోహిత్ శ‌ర్మ 13 ప‌రుగులు చేస్తే అరుదైన మైలురాయిని చేరుకుంటాడు.

IND vs ENG : ఇంగ్లాండ్‌తో మూడో వ‌న్డే.. అరుదైన మైలురాయిపై రోహిత్ క‌న్ను.. స‌చిన్‌, గంగూలీ, పాంటింగ్, సంగ‌క్క‌ర‌ల రికార్డుల‌ను బ్రేక్ చేసే గోల్డెన్ ఛాన్స్‌

Rohit sharma 13 runs away to reach 11 thousand runs in odi

Updated On : February 11, 2025 / 11:57 AM IST

టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ఎట్ట‌కేల‌కు ఫామ్‌లోకి వ‌చ్చాడు. క‌ట‌క్ వేదిక‌గా ఇంగ్లాండ్‌తో జ‌రిగిన రెండో వ‌న్డే మ్యాచ్‌లో సెంచ‌రీతో చెల‌రేగాడు. వ‌న్డేల్లో రోహిత్ కి ఇది 32వ సెంచ‌రీ. ఈ మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ 90 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్స‌ర్ల సాయంతో 119 ప‌రుగులు చేశాడు. ఛాంపియ‌న్స్ ట్రోఫీకి ముందు హిట్‌మ్యాన్ ఫామ్‌లోకి రావ‌డంతో ఫ్యాన్స్ ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.

ఇంగ్లాండ్‌తో మూడు వ‌న్డేల సిరీస్‌ను భార‌త్ మ‌రో మ్యాచ్ మిగిలి ఉండ‌గానే కైవ‌సం చేసుకుంది. నామ‌మాత్ర‌మైన ఆఖ‌రి వ‌న్డే మ్యాచ్ ఫిబ్ర‌వ‌రి 12 (బుధ‌వారం) జ‌ర‌గ‌నుంది. అహ్మ‌దాబాద్ వేదిక‌గా ఈ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శ‌ర్మ 13 ప‌రుగులు చేస్తే వ‌న్డేల్లో 11 వేల ప‌రుగుల క్ల‌బ్‌లో అడుగుపెట్ట‌నున్నాడు.

Champions trophy 2025 : పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు ముందు భార‌త్‌కు ఐసీసీ గుడ్‌న్యూస్‌.. విజ‌యం మ‌న‌దేరా..

రోహిత్ శ‌ర్మ ఇప్ప‌టి వ‌ర‌కు 267 వ‌న్డే మ్యాచ్‌లు ఆడాడు. 259 ఇన్నింగ్స్‌ల్లో 49.3 స‌గ‌టుతో 10,987 ప‌రుగులు చేవాడు. ఇందులో 32 సెంచ‌రీలు, 57 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. ఇంకో 13 ప‌రుగులు చేస్తే 11వేల క్ల‌బ్‌లో చేర‌నున్నాడు. ఈ క్ర‌మంలో అత్య‌ధిక వేగంగా 11 వేల ప‌రుగుల మైలురాయిని చేరుకున్న రెండో ప్లేయ‌ర్‌గా రికార్డుల‌కు ఎక్క‌నున్నాడు. ఈ క్ర‌మంలో స‌చిన్‌, గంగూలీ, పాంటింగ్‌ల రికార్డుల‌ను రోహిత్ బ్రేక్ చేయ‌నున్నాడు.

వ‌న్డేల్లో అత్యంత వేగంగా(ఇన్నింగ్స్‌ల ప‌రంగా) 11వేల ప‌రుగులు చేసిన ఆట‌గాడిగా టీమ్ఇండియా స్టార్ ఆట‌గాడు విరాట్ కోహ్లీ ఉన్నాడు. కోహ్లీ 222 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘ‌న‌త అందుకున్నాడు. స‌చిన్ 276 ఇన్నింగ్స్‌ల్లో, పాంటింగ్ 286 ఇన్నింగ్స్‌ల్లో , గంగూలీ 288 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘ‌న‌త సాధించాడు. రోహిత్ గ‌నుక రేప‌టి మ్యాచ్‌లో 13 ప‌రుగులు సాధిస్తే.. 260 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘ‌న‌త సాధిస్తాడు.

వ‌న్డేల్లో అత్యంత వేగంగా (ఇన్నింగ్స్‌ల) 11వేల ప‌రుగుల మైలురాయిని అందుకున్న ప్లేయ‌ర్లు..

విరాట్ కోహ్లీ (భార‌త్) – 222 ఇన్నింగ్స్‌ల్లో
స‌చిన్ టెండూల్క‌ర్ (భార‌త్) – 276 ఇన్నింగ్స్‌ల్లో
రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) – 286 ఇన్నింగ్స్‌ల్లో
సౌర‌వ్ గంగూలీ (భార‌త్‌) – 288 ఇన్నింగ్స్‌ల్లో
జాక్వెస్ క‌లిస్ (ద‌క్షిణాఫ్రికా) – 293 ఇన్నింగ్స్‌ల్లో

IPL 2025 : కోల్‌కతాలో ఫైనల్, హైదరాబాద్‌లో ప్లేఆఫ్.. ఐపీఎల్ పూర్తి షెడ్యూల్ ఎప్పుడంటే?

వ‌న్డేల్లో 11వేల క్ల‌బ్‌లో అడుగుపెట్టిన ప‌దో ఆట‌గాడిగా..

వ‌న్డేల్లో ఇప్ప‌టి వ‌ర‌కు తొమ్మిది మంది ఆట‌గాళ్లు మాత్ర‌మే 11వేల ప‌రుగుల కంటే ఎక్కువ ప‌రుగులు సాధించారు. అహ్మ‌దాబాద్‌లో రోహిత్ 13 ప‌రుగులు చేస్తే వ‌న్డేల్లో ప‌ద‌కొండు వేల ప‌రుగులు సాధించిన ప‌దో ఆట‌గాడిగా రికార్డుల‌కు ఎక్కుతాడు. 18,426 ర‌న్స్‌తో స‌చిన్ టెండూల్క‌ర్ వ‌న్డేల్లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాళ్ల జాబితాలో అగ్ర‌స్థానంలో ఉన్నాడు. ఆ త‌రువాత సంగ‌క్క‌ర‌, విరాట్ కోహ్లీ, రికీ పాంటింగ్‌లు వ‌రుస‌గా ఉన్నారు.

వ‌న్డేల్లో 11000ఫ్ల‌స్ రన్స్‌ చేసిన ఆట‌గాళ్లు వీరే..

* స‌చిన్ టెండూల్క‌ర్ (భార‌త్) – 18,426 ప‌రుగులు
* కుమార సంగ‌క్క‌ర (శ్రీలంక‌) – 14, 234 ప‌రుగులు
* విరాట్ కోహ్లీ (భార‌త్) – 13,911 ప‌రుగులు
* రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) – 13,704 ప‌రుగులు
* స‌న‌త్ జ‌యసూర్య (శ్రీలంక‌) – 13,430 ప‌రుగులు
* జ‌య‌వ‌ర్థ‌నే (శ్రీలంక‌) – 12,650 ప‌రుగులు
* ఇంజమామ్ ఉల్ హక్ (పాకిస్థాన్‌) – 11,739 ప‌రుగులు
* జాక్వెస్ క‌లిస్ (ద‌క్షిణాఫ్రికా) – 11579 ప‌రుగులు
* సౌర‌వ్ గంగూలీ (భార‌త్‌) – 11363 ప‌రుగులు