IPL 2025 : కోల్‌కతాలో ఫైనల్, హైదరాబాద్‌లో ప్లేఆఫ్.. ఐపీఎల్ పూర్తి షెడ్యూల్ ఎప్పుడంటే?

మార్చి 21 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది.

IPL 2025 : కోల్‌కతాలో ఫైనల్, హైదరాబాద్‌లో ప్లేఆఫ్.. ఐపీఎల్ పూర్తి షెడ్యూల్ ఎప్పుడంటే?

IPL 2025 Final at Eden Gardens schedule likely out by next week

Updated On : February 11, 2025 / 10:26 AM IST

క్రికెట్ ప్రేమికులు ఎంత‌గానో ఎదురుచూసే టోర్నీల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఒక‌టి. భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఆధ్వ‌ర్యంలో ఈ టోర్నీ జ‌ర‌గుతోంది. 2008లో ప్రారంభ‌మైన ఈ టోర్నీ విజ‌య‌వంతంగా 17 సీజ‌న్లు పూర్తి చేసుకుంది. ఇక 18 సీజ‌న్ 2025 మార్చి 21 నుంచి ప్రారంభం కానున్న‌ట్లు ఇప్ప‌టికే బీసీసీఐ వెల్ల‌డించింది. అయితే.. పూర్తి షెడ్యూల్‌ను మాత్రం విడుద‌ల చేయ‌లేదు. దీంతో క్రికెట్ ఫ్యాన్స్ ఐపీఎల్ షెడ్యూల్ కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

కాగా.. ఐపీఎల్ 2025 సీజ‌న్ షెడ్యూల్‌ను మ‌రో వారం రోజుల్లో వెల్ల‌డించ‌నున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. స్పోర్ట్స్ టాక్ నివేదిక ప్ర‌కారం ఐపీఎల్ 2025 ఫైనల్ కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న‌ట్లు తెలిపింది. మే 25న ఈ మ్యాచ్ జ‌రగ‌నున్న‌ట్లు పేర్కొంది. అంతేకాదండోయ్ ఫ్లేఆఫ్ 2 మ్యాచ్ కూడా కోల్‌క‌తానే వేదిక కానుందట‌. ఇక ప్లేఆఫ్ 1, ఎమిలినేట‌ర్ మ్యాచ్ ల విష‌యానికి వ‌స్తే అవి హైద‌రాబాద్‌లోని ఉప్ప‌ల్ మైదానంలో జ‌ర‌గ‌నున్నాయ‌ని తెలిపింది.

మళ్లీ కొట్టుకున్న హర్భజన్, అక్తర్.. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఘటన.. వీడియో వైరల్..

ప్ర‌తి సీజ‌న్‌లో ఆరంభ మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియ‌న్ ఆడ‌తాది అన్న సంగ‌తి తెలిసిందే. ఐపీఎల్ 2024 విజేత‌గా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ నిలిచింది. ఈ క్ర‌మంలో తొలి మ్యాచ్‌లో కేకేఆర్‌తో ఎవ‌రు త‌ల‌ప‌డ‌తారో చూడాలి.

కాగా.. ప్ర‌తి జ‌ట్టు త‌మ సొంత మైదానంలో సగం మ్యాచ్‌లు మిగిలిన స‌గం మ్యాచ్‌లు ప్ర‌త‌ర్థి మైదానాల్లో ఆడ‌డం ఆన‌వాయితీ. అయితే.. ఈ సారి మాత్రం రెండు జ‌ట్లు రాజ‌స్థాన్‌, ఢిల్లీ లు త‌మ హోమ్ మ్యాచ్‌ల‌ను త‌మ స్వంత మైదానాల‌తో పాటు మ‌రొక మైదానంలోనూ ఆడ‌నున్నాయ‌ట‌. రాజ‌స్థాన్ హోం గ్రౌండ్ జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియం. ఈ మైదానంలో ఐదు మ్యాచ్‌లు,అస్సాంలోని బర్సపారా క్రికెట్ (ACA) స్టేడియంలో రెండు మ్యాచ్‌లను ఆర్ఆర్ ఆడ‌నుంది. అటు ఢిల్లీ త‌మ హోమ్ గ్రౌండ్ అయిన అరుణ్ జైట్లీ మైదానంలో ఐదు మ్యాచ్‌లు ఆడ‌నుండ‌గా వైజాగ్‌లోని ACA-VDCA స్టేడియంలో రెండు మ్యాచ్‌లు ఆడ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

IND vs ENG : ఇంగ్లాండ్‌కు మరో భారీ షాక్‌.. అసలే టీ20, వన్డే సిరీస్లు ఓడి ఏడుస్తున్న టైమ్ లో..

రూ.639.15 కోట్ల‌ ఖ‌ర్చు

ఐపీఎల్ 2025 సీజ‌న్ కోసం గ‌తేడాది న‌వంబ‌ర్‌లో మెగా వేలాన్ని నిర్వ‌హించారు. సౌదీ అరేబియాలోని జెడ్డా వేదిక‌గా జ‌రిగిన మెగావేలంలో అన్ని ఫ్రాంచైజీలు త‌మ‌కు కావాల్సిన ఆట‌గాళ్ల‌ను కొనుగోలు చేశాయి. త‌ద్వారా త‌మ జ‌ట్ల‌ను బ‌లోపేతం చేసుకున్నాయి. రెండు రోజుల పాటు జ‌రిగిన వేలంలో 182 మంది ఆట‌గాళ్ల కోసం అన్ని ఫ్రాంచైజీలు రూ.639.15 కోట్ల‌ను ఖ‌ర్చు చేశాయి. టీమ్ఇండియా యువ ఆట‌గాడు రిష‌బ్ పంత్‌ను ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ రూ.27 కోట్ల‌కు కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక ధ‌ర‌కు అమ్ముడైన ఆట‌గాడిగా పంత్ రికార్డుల‌కు ఎక్కాడు. మ‌రో టీమ్ఇండియా ఆట‌గాడు శ్రేయ‌స్ అయ్య‌ర్ ను రూ.26.75 కోట్ల‌కు పంజాబ్ కింగ్స్‌, వెంక‌టేశ్ అయ్య‌ర్ ను రూ.23.75 కోట్ల‌కు కోల్‌క‌తా నైట్ రైడర్స్ జ‌ట్లు ద‌క్కించుకున్నాయి.