మళ్లీ కొట్టుకున్న హర్భజన్, అక్తర్.. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఘటన.. వీడియో వైరల్..
భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మరికొన్ని రోజుల్లో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు రెండు దేశాలు దిగ్గజ ఆటగాళ్లు మైదానంలోనే గొడవకు దిగారు.

Harbhajan Singh clashes with Shoaib Akhtar ahead of Champions Trophy
మరో 12 రోజుల్లో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. యావత్తు క్రికెట్ ప్రేమికులు ఈ మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ వేదికగా ఫిబ్రవరి 23న ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో తమ జట్టే విజయం సాధించాలని ఇరు దేశాల అభిమానులు కోరుకుంటున్నారు. ఈ మ్యాచ్‌కు సమయం దగ్గర పడగా.. ఇప్పుడు ఈ రెండు దేశాల దిగ్గజ ఆటగాళ్లు గొడవ పడడం కలకలం రేపుతోంది.
టీమ్ఇండియా మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్, పాకిస్థాన్ మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్ బాహాబాహికి దిగారు. మైదానంలోనే ఉన్న సమయంలో బ్యాట్ పట్టుకుని వెళ్లి మరీ హర్భజన్ సింగ్.. అక్తర్‌కు వార్నింగ్ ఇచ్చాడు. ఈ క్రమంలో ఒకరినొకరు తోసేసుకున్నారు. ఇంటర్నేషనల్ లీగ్ టి-20 ఫైనల్ మ్యాచ్ సందర్భంగా దుబాయ్ స్టేడియంలో వీరిద్దరు ఇలా గొడవపడ్డారు.
Thats our way of getting ready for Champions Trophy. @harbhajan_singh kee kehnday oh? pic.twitter.com/ZufYlOt7Y4
— Shoaib Akhtar (@shoaib100mph) February 9, 2025
అయితే.. ఇది నిజమైన గొడవ కాదు. సరదాగా మాత్రమే వీరిద్దరు ఇలా చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను షోయబ్ అక్తర్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి మేమిలా సిద్ధం అవుతున్నాం అంటూ రాసుకొచ్చాడు. ఈ వీడియో వైరల్‌గా మారగా నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.
ఇక ఛాంపియన్స్ ట్రోఫీ విషయానికి వస్తే.. ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. 8 దేశాలు ఈ టోర్నీలో పాల్గొననున్నాయి. ఇప్పటికే అన్ని దేశాలు ఈ మెగాటోర్నీలో పాల్గొనే జట్లను ప్రకటించాయి. ఆయా జట్లలో మార్పులు, చేర్పులకు నేడు (ఫిబ్రవరి 11) తుది అవకాశం. జస్‌ప్రీత్ బుమ్రా పైనే అందరి కళ్లు ఉన్నాయి. అతడు ఛాంపియన్స్ ట్రోఫీ బరిలో ఉంటాడా ఉండడా అన్న సంగతి ఈ రోజు తెలిసిపోనుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోని చివరి టెస్టు మ్యాచ్‌లో బుమ్రాకు వెన్ను గాయం తిరగబెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నాడు.
IND vs ENG : ఇంగ్లాండ్‌కు మరో భారీ షాక్.. అసలే టీ20, వన్డే సిరీస్లు ఓడి ఏడుస్తున్న టైమ్ లో..
2017లో చివరిసారిగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టును ఓడించి పాకిస్థాన్ విజేతగా నిలిచింది. దీంతో ఫిబ్రవరి 23న జరగనున్న మ్యాచ్‌లో గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని టీమ్ఇండియా అభిమానులు కోరుకుంటున్నారు.