IPL 2023: ధోనీ సేనకు శుభ్‌మన్ గిల్ స్వీట్ వార్నింగ్..
2023 ఐపీఎల్ సీజన్‌లో శుభ్‌మన్ అద్భుత ఫామ్ కొనసాగిస్తున్నాడు. ఈ సీజన్‌లో గిల్ 680 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో రెండో ప్లేస్‌లో ఉన్నాడు.
- Harishth Thanniru
- Published On : May 23, 2023 / 01:01 PM IST
MS Dhoni and Shubman Gil
Shubman Gil: ఐపీఎల్ 2023 టోర్నీ చివరి దశకు చేరింది. ప్లే ఆఫ్‌కు చేరిన నాలుగు జట్లు ఫైనల్ పోరులోకి దూసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో తొలి క్వాలిఫయర్ మ్యాచ్ ఈరోజు చెపాక్ స్టేడియంలో సాయంత్రం జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు, గుజరాత్ టైటాన్స్ జట్టు మధ్య జరుగుతుంది. విజయంపై రెండు జట్ల ప్లేయర్లు దీమాతో ఉన్నారు. రెండు జట్లు అన్ని విభాగాల్లో సమఉజ్జీలుగా ఉన్నాయి. ఈ క్రమంలో మ్యాచ్‌లో ఏ జట్టుది పైచేయి అవుతుందనే అంశం ఆసక్తికరంగా మారింది.
MS Dhoni : ధోనీకి హెలికాప్టర్ షాట్ నేర్పింది ఎవరో తెలుసా?
తొలి క్వాలిఫయర్ మ్యాచ్ సందర్భంగా గుజరాత్ జట్టు బ్యాటర్ శుభ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ధోనీ సేనకు స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. ఈ మ్యాచ్ లో విజయం సాధించి ఫైనల్ రేసుకు గుజరాత్ జట్టు దూసుకెళ్తుందని దీమా వ్యక్తం చేశాడు. చెపాక్ వికెట్‌పై చెన్నై జట్టును ఎదుర్కొనేందుకు మా వద్ద అద్భుతమైన బౌలింగ్ దళం ఉందని అన్నారు. రెండో సారి ఫైనల్‌లోకి అడుగు పెడతామని మాకు విశ్వాసం ఉందని చెప్పాడు. గిల్ తన ఫామ్ గురించి మాట్లాడుతూ.. నా ఆటేంటో నాకు తెలుసు.. ఏ ఆటగాడికైనా తనకు తాను తెలుసుకోవడం ముఖ్యం. మంచి స్టార్ట్ లభిస్తే భారీ స్కోర్ చేసే అవకాశాలు ఉంటాయని అన్నారు.
2023 ఐపీఎల్ సీజన్‌లో గిల్ అద్భుత ఫామ్ కొనసాగిస్తున్నాడు. వరుసగా సెంచరీ, ఆఫ్ సెంచరీల మోతమోగిస్తున్నాడు. ఈ సీజన్‌లో గిల్ 680 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో రెండో ప్లేస్ లో ఉన్నాడు. ఆర్సీబీ కెప్టెన్ డుప్లెసిస్ (730) పరుగులతో తొలి స్థానంలో ఉన్నాడు.
