IPL 2023: కోహ్లీని మరోసారి టార్గెట్ చేసిన నవీన్ ఉల్‌హుక్!.. ఆర్సీబీ ఓటమి తరువాత వీడియో షేర్ చేసిన లక్నో ప్లేయర్
కోహ్లీ సెంచరీ చేసినప్పటికీ ఆర్సీబీ జట్టు ఓడిపోవటంతో ప్లే ఆఫ్ అవకాశాలను కోల్పోయింది. మ్యాచ్ ఫలితం వచ్చిన కొద్దిసేపటికే లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఫేసర్ నవీన్ ఉల్ హక్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ వీడియోను షేర్ చేశాడు.

Naveen Ul Haq
Naveen Ul Haq: ఐపీఎల్ 2023 టోర్నీ చివరి దశకు చేరింది. లీగ్ మ్యాచ్‌లు ఆదివారంతో పూర్తయ్యాయి. దీంతో ఫ్లే ఆఫ్‌కు గుజరాత్, చెన్నై సూపర్ కింగ్స్, లక్నో, ముంబయి ఇండియన్స్ జట్లు చేరాయి. ప్లేఆఫ్‌కు చేరేందుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తీవ్రంగా కృషి చేసింది. ఆదివారం రాత్రి గుజరాత్ జట్టుతో బెంగళూరు జట్టు తలపడింది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టినప్పటికీ జట్టుకు ఓటమిని తప్పించలేక పోయాడు. గుజరాత్ బ్యాటర్ శుభ్‌మాన్ గిల్ సెంచరీతో గుజరాత్ జట్టు విజయకేతనం ఎగురవేసి బెంగళూరు ప్లేఆఫ్ ఆశలను నీరుగార్చింది.
కోహ్లీ సెంచరీ చేసినప్పటికీ ఆర్సీబీ జట్టు ఓడిపోవటంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. మ్యాచ్ ఫలితం వచ్చిన కొద్దిసేపటికే లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఫేసర్ నవీన్ ఉల్ హక్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ వీడియోను షేర్ చేశాడు. ఈ వీడియో కోహ్లీని ఉద్దేశించి పెట్టేందనని భావించిన ఆర్సీబీ అభిమానులు నవీన్‌పై మండిపడుతున్నారు. ప్లే ఆఫ్ ఆశలు కోల్పోయి బాధలో ఉంటే పుండు మీద కారం చల్లినట్లు ఇలాంటి వీడియో పెడతావా అంటూ ప్రశ్నిస్తున్నారు. లక్నో జట్టు అభిమానులు మాత్రం నవీన్‌కు మద్దతుగా నిలిచారు.
నవీన్ ఉల్ హక్ షేర్ చేసిన వీడియోలో ఓ వ్యక్తి నవ్వుతూ కనిపిస్తాడు. కోహ్లీ జట్టు ప్లే ఆఫ్ కు చేరుకుంటే లక్నో జట్టుతో తలపడాల్సి వచ్చేంది. ఆ అవకాశాన్ని ఆర్సీబీ కోల్పోయింది. బుధవారం లక్నో, ముంబయి జట్లు తలపడతాయి. వీరిలో ఏ జట్టు గెలిస్తే ఆ జట్టు ఫైనల్ కు వెళ్తుంది.
Virat Kohli Letter BCCI: నేను చేసిన తప్పేంటి.. భారీ జరిమానాపై బీసీసీఐకి లేఖ రాసిన విరాట్ కోహ్లీ
ఇదిలాఉంటే గతంలోనూ కోహ్లీ, నవీన్ ఉల్ హక్ మధ్య వివాదం తలెత్తింది. ఈ టోర్నీలో లక్నో, బెంగళూరు జట్లు రెండు సార్లు తలపడ్డాయి. మొదటి మ్యాచ్‌లో లక్నో విజయం సాధించగా.. రెండో మ్యాచ్‌లో బెంగళూరు జట్టు విజయం సాధించింది. మొదటి మ్యాచ్ సమయంలో కోహ్లీకి, లక్నోజట్టు మెంటర్ గంభీర్‌కు మధ్య వివాదం తలెత్తింది. రెండో మ్యాచ్ ఆడుతున్న సమయంలో నవీన్ ఉల్ హక్, కోహ్లీ మధ్య వివాదం తలెత్తింది. లక్నో జట్టు ప్లేయర్ పై దురుసుగా ప్రవర్తించడంతో మరోసారి కోహ్లీ, గంభీర్ మధ్య వివాదం తలెత్తింది. ఈ ఘటనను బీసీసీఐ సీరియస్‌గా తీసుకొని ముగ్గురికి జరిమానాలు విధించిన విషయం తెలిసిందే.
Naveen Ul Haq posted this video on his Instagram after RCB lost the match#RCBvsGT pic.twitter.com/FCaF41IMnM
— Gems of Shorts (@Warlock_Shabby) May 21, 2023