Shubman Gill to be palyed his100th IPL Game today
Shubman Gill 100th IPL Game : గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అరుదైన మైలురాయి ముంగిట ఉన్నాడు. ఐపీఎల్ చరిత్రలో వంద మ్యాచులు ఆడిన ఆటగాళ్ల జాబితాలో చోటు సంపాదించేందుకు కేవలం ఒక్క మ్యాచ్ దూరంలో ఉన్నాడు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో నేడు(ఏప్రిల్ 24) జరగబోయే మ్యాచ్ అతడి కెరీర్‌లో వందో ఐపీఎల్ మ్యాచ్ కానుంది. ఈ మెమరబుల్ మ్యాచ్ మరింత ప్రత్యేకంగా మార్చుకోవాలని అతడి అభిమానులు కోరుకుంటున్నారు.
కాగా.. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు 64 మంది మాత్రమే 100 మ్యాచులకు పైగా ఆడారు. నేటి మ్యాచులో గిల్ బరిలోకి దిగితే 65వ ఆటగాడిగా రికార్డులకు ఎక్కనున్నాడు.
2018లో ఐపీఎల్ లో అడుగుపెట్టిన గిల్ 2021 వరకు కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 2022 నుంచి గుజరాత్ టైటాన్స్‌కు ఆడుతున్నాడు. ఇప్పటి వరకు ఐపీఎల్‌లో 99 మ్యాచులు ఆడాడు. 38.1 సగటుతో 135.2 స్ట్రైక్‌రేటుతో 3088 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, 20 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
గుజరాత్ టైటాన్స్ 2022లో ఐపీఎల్ ట్రోఫీని అందుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ సీజన్‌లో మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి ఆరెంజ్ క్యాప్‌ను దక్కించుకున్నాడు.
ఇదిలా ఉంటే.. ఈ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ ఇప్పటి వరకు 8 మ్యాచులు ఆడింది. నాలుగు మ్యాచుల్లో గెలవగా మరో నాలుగు మ్యాచుల్లో ఓడిపోయింది. 8 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. మరో వైపు ఢిల్లీ సైతం ఎనిమిది మ్యాచులు ఆడగా మూడింటిలో విజయం సాధించింది. మరో ఐదు మ్యాచుల్లో ఓడిపోయింది. ఆరు పాయింట్లతో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది.
MS Dhoni : ధోనికి కోపమొచ్చింది..! ‘నన్నెందుకు చూపిస్తున్నావు.. కొట్టేస్తా మిమ్మల్ని’
హెడ్ టూ హెడ్ రికార్డు విషయానికి వస్తే.. ఇరు జట్లు ఇప్పటి వరకు నాలుగు సందర్భాల్లో తలపడ్డాయి. చెరో రెండు మ్యాచుల్లో విజయం సాధించాయి.