Prince William : ఇంగ్లాండ్ ఆటగాళ్లపై జాత్యాహంకార దూషణలు..ఖండించిన ప్రిన్స్ విలియం

బ్రిటన్ లోని వెంబ్లీ స్టేడియంలో ఆదివారం జ‌రిగిన యూరో 2020(ఫుట్ బాల్ టోర్నమెంట్) ఫైన‌ల్‌లో ఇంగ్లండ్‌పై ఇట‌లీ ఘ‌న విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే.

Prince William బ్రిటన్ లోని వెంబ్లీ స్టేడియంలో ఆదివారం జ‌రిగిన యూరో 2020(ఫుట్ బాల్ టోర్నమెంట్) ఫైన‌ల్‌లో ఇంగ్లండ్‌పై ఇట‌లీ ఘ‌న విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. రెండు జ‌ట్లు స‌మాన గోల్స్‌ను చేసినా పెనాల్టీల ప‌రంగా ఇట‌లీ పైచేయి సాధించింది. దీంతో ఇటలీని విజ‌యం వ‌రించింది.

అయితే యూరో 2020 ఫైనల్ లో ఓటమి తరువాత ఈ మ్యాచ్ లో పాల్గొన్న ఆఫ్రికన్ సంతతికి చెందిన ఇంగ్లాండ్ సాకర్ ఆటగాళ్లను(మార్కస్ రష్ ఫోర్డ్,జాడన్ సాంచో,బుకాయో సాకా)లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో జాత్యహంకార దూషణలు చేయడం ప్రారంభించారు పలువురు నెటిజన్లు. వీరి వల్లే ఇంగ్లాండ్ కప్ ని కోల్పోవాల్సి వచ్చిందంటూ వారిపై ఆన్ లైన్ వేదికగా జాత్యాంహకర దూషణలు చేశారు.

అయితే ఇంగ్లండ్ ఆటగాళ్లపై జాత్యాంహకార దూషణలను బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ సహా పలువురు ప్రముఖులు ఖండించారు. జాత్యంహర దూషణల వ్యవహారాన్ని ఖండిస్తున్న బృందంలో సోమవారం బ్రిటన్ రాజవంశీయుడు మరియు క్వీన్ ఎలిజబెట్ మనువడైన ప్రిన్స్ విలియం కూడా చేరారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. గత రాత్రి మ్యాచ్ తర్వాత ఇంగ్లాండ్ ఆటగాళ్లను లక్ష్యంగా చేసుకుని జాత్యహంకార దూషణలు చేయడం పట్ల నేను బాధపడుతున్నాను. ఈ అసహ్యకరమైన ప్రవర్తనను ఆటగాళ్ళు భరించాల్సి రావడం పూర్తిగా ఆమోదయోగ్యం కాదు. ఇది ఇప్పుడే ఆగిపోవాలి మరియు పాల్గొన్న వారందరూ జవాబుదారీగా ఉండాలి అని ప్రిన్స్ విలియం తన ట్వీట్ లో పేర్కొన్నారు.

ట్రెండింగ్ వార్తలు